రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పించనున్న “స్లమ్ డాగ్ హజ్బెండ్”, హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’.

చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది.

ఇది మంచి కంటెంట్ ఉన్న ఓ చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం.

ఇక మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం చేస్తున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు.

గతంలోనే అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ కు మంచి స్పందన వచ్చింది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదలైన ఫ్రస్ట్రేషన్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

పెళ్లితో వచ్చే ఫ్రస్టేషన్ పై సాగే ఈ పాటలో స్టార్ యాక్టర్ సునీల్ స్పెషల్ అప్పీయరెన్స్ చేయడం విశేషం.

కంప్లీట్ కామికల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇంతకు ముందు ఓ పిట్టకథ చిత్రంతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ రావుకు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇస్తుంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.

"""/" / సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సప్తగిరి, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

H3 Class=subheader-styleసాంకేతిక నిపుణులు :/h3p ఎడిటర్ - వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ - శ్రీనివాస్ జె రెడ్డి , సంగీతం - భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం - కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి , పీఆర్వో - జీఎస్కే మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రమేష్ కైగురి , బిజినెస్ హెడ్ : రాజేంద్ర కొండ , సహ నిర్మాతలు - చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల , ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం , నిర్మాతలు - అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన దర్శకత్వం - డాక్టర్ ఏఆర్ శ్రీధర్.

రాజమౌళికి పోటీగా మారుతున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. ఇద్దరిలో నంబర్ వన్ ఎవరు?