టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి.( Arjun Reddy Movie ) ఈ సినిమా విజయ్ దేవరకొండ గా కెరియర్ ని మలుపు తిప్పింది అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాతో ఒక్కసారైనా రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ.పెళ్లి చూపులతో ఫేమ్ అయ్యి, ఈ చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు.
అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు.కొన్నాళ్లు డిజాస్టర్లు చూపినా మళ్లీ పుంజుకుంటున్నారు.
చివరిగా ఖుషి మూవీతో హిట్ అందుకున్నారు.
దీంతో నెక్ట్స్ సినిమాలపై హైప్ క్రియేట్ అయ్యింది.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా కథ ( Arjun Reddy Movie Story )గురించి ఆసక్తికరమైన విషయం తెలిసిందే.ఆ విషయాన్ని కూడా విజయ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం.
విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.అర్జున్ రెడ్డి సినిమాను ఎక్కడి నుంచి ఇన్ స్పైర్ అయ్యారనే దానిపై స్పందించారు.
ఇంటర్వ్యూయర్ అడిగిన ఈ ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చారు.అర్జున్ రెడ్డి సినిమా కథను సందీప్ రెడ్డి( Sandeep Reddy ) ఎక్కడి నుంచి ఇన్ స్పైర్ అవ్వలేదు.
ఆయన జీవితంలోని రియల్ లైఫ్ ఇన్సిడెన్స్, ముఖ్యంగా ఆయన మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనల ఆధారంగా స్ట్రాంగ్ లవ్ స్టోరీతో తెరకెక్కించారని తెలిపారు.సినిమాను సందీప్ అనుకున్నట్టు తీసేందుకు ఎంతో సమయం కేటాయించారు.అందుకే షూటింగ్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నారు.ఏదేమైనా ఆ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారి కోలీవుడ్, బాలీవుడ్ లోనూ రీమేక్ అయిన విషయం తెలిసిందే.