రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఖుషి‘ ( Khushi ).ఖుషి సినిమా స్టార్ట్ అవ్వగానే అంచనాలు పీక్స్ లోకి చేరిపోయాయి.
ఎందుకంటే విజయ్, సమంత పెయిర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఆకట్టు కుంటుందో అని చూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా రిలీజ్ అయిన ఆరాధ్య సాంగ్ తో ఈ రేంజ్ లో ఉంటుంది అని చూపించారు.ఈ సాంగ్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా చార్ట్ బస్టర్ గా నిలిచింది.‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ సాంగ్ ను నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు…
హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ కూడా మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఆరాధ్య సాంగ్ రిలీజ్ అయ్యి 24 గంటలు కూడా కాకుండా 5 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది.
అలాగే టాప్ 1 లో ట్రెండింగ్ అవుతుంది.ఇక శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తుండగా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది…

విజయ్, సమంత ఇద్దరి ఖాతాలో ప్రజెంట్ ప్లాప్స్ ఉండడంతో ఈ జంట హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.విజయ్ లైగర్ సినిమాతో, సమంత శాకుంతలం సినిమాతో భారీ ప్లాప్ లను అందుకున్న విషయం తెలిసిందే.అందుకే ఖుషి వంటి ఆకట్టుకునే లవ్ స్టోరీతో అయిన ఇద్దరు కలిసి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.
చూస్తుంటే ఈ లవ్ స్టోరీతో వీరిద్దరూ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అనిపిస్తుంది.







