డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సమంత(Samantha )హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఖుషి(Kushi).ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పాటలు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.మరి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ కాశ్మీర్లో మొదలవుతుంది.బుర్ఖాలో ఉన్న బేగం (సమంత) ను( Begum ) చూసిన విప్లవ్ ( విజయ్ దేవరకొండ)( Viplav ) ఆ క్షణమే ఇది నా పిల్ల అని ఫిక్స్ అవుతాడు.ఇలా మొదటి చూపులోనే బేగం ప్రేమలో పడతారు.
కొన్ని పరిస్థితుల కారణంగా బ్రాహ్మిన్ అటువంటి ఆరాధ్య (సమంత) బేగంగా మారాల్సి వస్తుంది.చంద్రరంగం (మరళీశర్మ) గారి అమ్మాయి ఆరాధ్య ప్రేమను పొందడానికి లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్) గారి కొడుకు విప్లవ్ పెద్ద పోరాటమే చేస్తాడు.
ఆరాధ్య బ్రాహ్మిన్ అమ్మాయి విప్లవ నాస్తికుడు కావడంతో వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది మరి కుటుంబ సభ్యులను ఎదిరించి వీరి ప్రేమను బ్రతికించుకోవడం కోసం ఇంటి నుంచి బయటకు వస్తారు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న సమయంలోనే వీరి కథ కొత్త మలుపు తిరుగుతుంది మరి విప్లవ్ ఆరాధ్య కథ సుఖాంతం అయిందా లేక విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారా అనే విషయాలు తెలియాలి అంటే పూర్తిగా సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
నటీనటుల పనితీరు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించారని చెప్పాలి.సమంత కూడా ఈ ప్రేమ కథ చిత్రంలో( Love Story ) ఎంతో ఒదిగిపోయిన నటించారు.ఇక డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
టెక్నికల్:
ఖుషి సినిమాకు( Kushi Movie ) కథతో పాటు సంగీతం కూడా ఎంతో బాగా అందరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి.సినిమాటోగ్రఫీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది.కాశ్మీర్ అందాలతో చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా ఒక ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఇప్పటివరకు ఇలాంటి ప్రేమ కథ తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కనుక అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఇదివరకు సినిమాలలో చూసిన భావన కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్:
హీరో హీరోయిన్ నటన, సంగీతం
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని బోరింగ్ సన్నివేశాలు, కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే అనిపించాయి.
బాటమ్ లైన్:
ఇక ఈ సినిమా గురించి చివరగా చెప్పాల్సి వస్తే ప్రేమ కథ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనే చెప్పాలి.