బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తాజాగా మే 25న,50వ వసంతంలోకి అడుగు పెట్టారు.ఈ సందర్భంగా తాజాగా ఆయన ముంబైలో తన నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని నిర్వహించారు.
అయితే ఆ పార్టీకి బాలీవుడ్ కి చెందిన హీరో హీరోయిన్ లతో పాటుగా, లైగర్ టీం కూడా ఈ పార్టీలో సందడి చేసింది.లైగర్ సినిమా నుంచి హీరో విజయ్ దేవరకొండ వెళ్లి ఆ పార్టీలో సందడి సందడి చేశారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెగ వైరల్ అవుతోంది.
అదేమిటంటే హీరో విజయ్ దేవరకొండ తో పాటుగా హీరోయిన్ రష్మిక మందన్న కు కూడా ఆహ్వానం అందినట్లు జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి.
అయితే ఈ బర్త్ డే పార్టీ ఈవెంట్ కు టాలీవుడ్ హీరోయిన్ లలో కేవలం హీరోయిన్ రష్మిక కు మాత్రమే ఇన్విటేషన్ అందడం గమనార్హం.దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే వీరితో పాటుగా బాలీవుడ్ నుంచి ఈ పార్టీకి షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, మలైకా ఆరోరా, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు హాజరయ్యారు.

అలాగే వీరితో పాటుగా సారా అలీ ఖాన్ రణ్‌బీర్ కపూర్, ఆయాన్ ముఖర్జీ, మనీశ్ మల్హోత్రా, రణ్‌వీర్ సింగ్, అనన్య పాండే లాంటి స్టార్ సెలబ్రెటీలు ఈ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.







