ఆ ఇద్దరిలో రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తదుపరి సినిమా ఎవరితో..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత చిత్రం డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం లో చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.

 Vijay Devarakonda Next Film In Which Director , Vijay Devarakonda, Next Film, G-TeluguStop.com

అని వర్గాల ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమా ఎంపిక విషయం లో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.ఇప్పటికే శివ నిర్వాన దర్శకత్వం లో ఖుషి సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ను పరశురాం దర్శకత్వం లో చేసేందుకు ఓకే చెప్పాడు.

దిల్ రాజు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ను నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు.అయితే గతంలోనే ఆ కథ ను అల్లు అరవింద్ కు చెప్పడం వల్ల పరశురాం పై దర్శకుల మండలి మరియు నిర్మాతల మండలి లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది.

దాంతో విజయ్ దేవరకొండ హీరో గా పరశురామ్‌ దర్శకత్వం లో సినిమా దాదాపుగా క్యాన్సల్ అయింది అంటూ వార్తలొస్తున్నాయి.

ఇదే సమయంలో గౌతం తిన్ననూరి దర్శకత్వం లో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.ఆ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ గతంలోనే జరిగిందని వార్తలు కూడా వస్తున్నాయి.స్పోర్ట్స్ నేపథ్యం లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

ఎప్పుడు ఏంటి అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే.మొత్తానికి పరశురామ్ దర్శకత్వం లో కంటే ముందుగా గౌతం తిన్ననూరి దర్శకత్వం లో సినిమా ను చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరో వైపు విజయ్ దేవరకొండ సినిమా ఖుషి ని ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఖుషి ఆలస్యం అయిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube