రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) హీరోగా సమంత హీరోయిన్ గా హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాన ( Shiva Nirvana )దర్శకత్వం లో రూపొందిన ఖుషి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలు ఎంతగా ఉన్నా కూడా మంచి ప్రమోషన్ చేస్తేనే డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అవుతాయి అని గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయింది.
కనుక ఖుషి సినిమా కు సాధ్యం అయినంత ఎక్కువగా వసూళ్లు రావాలి అంటే కచ్చితంగా భారీ ప్రమోషన్ అవసరం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఖుషి సినిమా కు సంబంధించిన పాటలు సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

ఇక శివ నిర్వాన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమా పై సహజంగానే అంచనాలు ఆసక్తి ఉండటం కామన్.అందుకే ఖుషి సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేయడం ద్వారా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రికార్డు స్థాయి లో సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.విజయ్ దేవరకొండ గత చిత్రం లైగర్ తీవ్రంగా నిరాశ పరిచింది.అందుకే ఖుషి సినిమా( kushi movie ) కి పెద్దగా బజ్ ఉండక పోవచ్చ అన్నారు.కానీ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దాంతో సినిమా ను భారీ ఎత్తున ఖర్చు చేసి మరీ బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది.హీరోగా విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయింది.హీరోయిన్ గా ఈ సినిమా లో సమంత( Samantha ) నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.కనుక ఈ సినిమా తో విజయ్ ఇంకా సమంత ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ప్రమోషన్స్ ఇప్పటి వరకు చేసినవి సరి పోవని.ముందు ముందు మరింత భారీ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







