ఫ్యాన్ మూమెంట్.. విజయ్ టాటూ వేయించుకున్న లేడీ అభిమాని!

డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ఉంటే మనం వింటూనే ఉంటాం.ఫ్యాన్స్ అయితే వారు అభిమానించే హీరోల సినిమాల కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు.

 Vijay Devarakonda Meets Super Fan Who Got His Portrait On Her Back , Vijay Dever-TeluguStop.com

కానీ డై హార్డ్ ఫ్యాన్స్ అలా కాదు.వారి అభిమాన తారల ఇష్టాన్నే వారి ఇష్టంగా మార్చుకుంటారు.

ఇలా క్రేజ్ పెంచుకున్న హీరోలు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.వారిలో ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా చేరిపోయారు.

ఈయనకు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.ఇప్పుడు ఈయన ఖాతాలో ఒక క్రేజీ లేడీ డై హార్డ్ ఫ్యాన్ చేరిపోయింది.ఈమె చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు.విజయ్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు తన మెడపై పోర్ట్రెయిట్ టాటూ వేయించుకుని విజయ్ దేవరకొండకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది.టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండకూ అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది

టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.సోషల్ మీడియాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుని టాలీవుడ్ లోనే టాప్ 2 ప్లేస్ లో నిలబడ్డాడు.ముఖ్యంగా ఈయనకు లేడీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది.

తాజాగా ఇద్దరు యువతులు తమ ఫెవెరెట్ హీరో అయినా విజయ్ ను కలవగా ఆయన కూడా వారిని అభిమానంగా పలకరించారు.ఈ క్రమంలోనే ఒక అమ్మాయి తన వీపుపై వేయించుకున్న టాటూ ని చూపించి విజయ్ ను సర్ప్రైజ్ చేసింది.ఈ ఫ్యాన్ మూమెంట్ కు సంబందించిన వీడియో ఒకటి లైగర్ టీమ్ షేర్ చేయగా ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ వీడియోలో పూరీ, చార్మీ కూడా ఉన్నారు.

ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల అవ్వనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube