'లైగర్‌' కోసం టైమ్‌ అడిగిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్.ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది.

గత ఏడాది ఆరంభం లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు వెళ్లాల్సి ఉంది.ముంబయిలో ఈ సినిమా షూటింగ్ కోసం పూరి అండ్ టీమ్ వెళ్లారు.

కాని విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా జాయిన్ అవ్వలేదు.తాను నిర్మించిన తమ్ముడి సినిమా పుష్పక విమానం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం కాస్త సమయం అడిగినట్లుగా తెలుస్తోంది.

Advertisement

లైగర్ సినిమా చిత్రీకరణ కోసం విజయ్ దేవరకొండ వెళ్లాల్సి ఉండగా పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్ వల్ల ఆగిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తమ్ముడు ఆనంద్‌ దేవర కొండ కెరీర్‌ విషయంలో విజయ్ చాలా సీరియస్ గా ఉన్నాడు.అందుకే కథ ఎంపిక విషయం నుండి మొదలుకుని ప్రమోషన్స్ వరకు అన్ని కూడా ఆయనే చూసుకుంటున్నాడు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాను ఈ సమయంలో ఉండాలనే ఉద్దేశ్యంతో పూరిని అడిగి మరీ విజయ్‌ దేవరకొండ ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్‌ సినిమా చిత్రీకరణ కోసం వచ్చే నెల మొదటి వారంలో విజయ్ దేవరకొండ ముంబయి వెళ్తాడట.లేదంటే నేడో రోపో వెళ్లి మళ్లీ వచ్చే వారం ఆరంభంలో అయినా వస్తాడని తెలుస్తోంది.

మొత్తానికి పుష్పక విమానం కోసం రౌడీ స్టార్‌ కాస్త ఎక్కువ సమయం ను కేటాయిస్తాడని తెలుస్తోంది. దీపావళి సందర్బంగా పుష్పక విమానం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు