విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు మిశ్రమ స్పందన వస్తుంది.
వసూళ్లను చూస్తుంటే మాత్రం నిరాశ తప్పదేమో అనిపిస్తుంది.ఈసమయంలో ఈ సినిమా కథ మొదట దర్శకుడు పూరి జగన్నాథ్ తీసుకు వెళ్లి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.2016 సంవత్సరంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయం లో సోషల్ మీడియా ద్వారా కూడా చర్చించుకున్నారు.ఆ సమయంలో ఈ సినిమా ను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు.
బాక్సర్ అనే టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేయించారు అంటూ వార్తలు వచ్చాయి.
పూరి జగన్నాథ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణం లో బాక్సర్ సినిమా రాబోతుంది అంటూ కొందరు సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ లను కూడా షేర్ చేశారు.
కానీ అప్పుడు ఎన్టీఆర్ వరుసగా వేరు వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం తో పాటు పూరి జగన్నాథ్ ఆ కథ ను సరిగా చెప్పడం లో విఫలం అయ్యాడు అనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఆ సినిమాను చేసేందుకు ఓకే చెప్పలేదు.

అందుకే టెంపర్ వర్కౌట్ అయ్యింది.టెంపర్ కథ ను కనుక ఎన్టీఆర్ ఓకే చెప్పి ఉండకుంటే కచ్చితంగా లైగర్ సినిమా నే ఎన్టీఆర్ తో పూరి చేసేవాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ మరియు పూరి కాంబోలో ఒక వేళ లైగర్ సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేది అంటూ ఇప్పుడు కొందరు చర్చించుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కించుకున్న నేపథ్యం లో ఆయన తదుపరి సినిమా లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ కాంబో సినిమా లకు ఎన్టీఆర్ సైన్ చేసిన విషయం తెల్సిందే.







