'ఖుషి' యూఎస్ డే 1 వసూళ్లు.. ఒక్క రోజుకే రికార్డ్ కలెక్షన్స్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ”ఖుషి”.గత రెండు సినిమాలతో అందుకున్న పరాభవాన్ని మరిపించేలా హిట్ అందుకోవాలని ఆశ పడ్డ విజయ్ కు అలాంటి హిట్ ఖుషి సినిమా ఇచ్చింది అనే చెప్పాలి.

 Vijay Devarakonda Khushi Day 1 Collections In Usa, Vijay Devarakonda, Khushi Mov-TeluguStop.com

ముందు నుండి ఖుషి సినిమాకు యూఎస్ లో మంచి బుకింగ్స్ నమోదు కాగా ప్రీమియర్స్ ద్వారానే మంచి కలెక్షన్స్ రాబట్టగా ఇప్పుడు డే 1 వసూళ్ల గురించి అప్డేట్ తెలుస్తుంది.ఈ సినిమా జస్ట్ ప్రీమియర్స్ కే 4 లక్షల డాలర్స్ ను టచ్ చేయగా ఇప్పుడు డే 1 మొత్తం కలిసి 8 లక్షల డాలర్స్ ను క్రాస్ చేసినట్టుగా అఫిషియల్ గా పోస్టర్ ద్వారా తెలిపారు.

దీంతో ఈ సినిమా డే 1 లోనే హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది అనే చెప్పొచ్చు.అలా ఈ సినిమాకు అక్కడ మంచి వెల్కమ్ అందింది.ఇక ఈ వీకెండ్ మొత్తం కూడా మరో సినిమా లేకపోవడంతో ఖుషి( Kushi movie ) మరింత పుంజుకునే అవకాశం అయితే ఉంది… మొత్తానికి విజయ్ దేవరకొండకు అనుకున్న రేంజ్ లో హిట్ అయితే అందింది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖుషి సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఎట్టకేలకు ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ సమంత( Samantha ) జంట రొమాన్స్ లో బాగా అలరించింది.కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.అలాగే హేషం అబ్దుల్ సంగీతం అందించిన ఈ సినిమా మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube