రష్మిక మందన్న బర్త్ డే విజయ్ దేవర కొండకు లక్కీ డేనా... ఆరోజు కలిసొచ్చేనా?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) త్వరలోనే ఫ్యామిలీ స్టార్( Family Star ).సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

 Vijay Devarakonda Is Expecting To Luck On Rashmika Mandanna Birthday, Rashmika,-TeluguStop.com

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు.

తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా ఈయన అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఆ రోజే ఈ సినిమాని ఎందుకు విడుదల చేయబోతున్నారనే విషయం గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం పరీక్షలు కూడా ముగియడంతో ఈ సినిమాకు మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది.అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఉగాదికి సెలవులు కూడా వస్తున్న తరుణంలో ఫ్యామిలీ స్టార్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి.

అంతేకాకుండా ఆ రోజున రష్మిక ( Rashmika )పుట్టినరోజు ( Birthday ) కూడా కావటం విశేషం.

అదే రోజు రష్మిక మందన్న పుట్టినరోజు కూడా కదా అని చెప్పడంతో విజయ్ స్పందిస్తూ ఎస్ లక్కీ అని, తమ సినిమాకి కలిసి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.ఇలా ఆ రోజు కోసం విజయ్‌ వెయిట్‌ చేస్తున్నారు.మరి రష్మిక బర్త్ డే విజయ్‌కి కలిసి వస్తుందా? హిట్‌తో ఆమెని సర్‌ప్రైజ్‌ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) నటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube