సినిమా ప్లాప్.. అయినా తగ్గని హీరో.. కష్టాల్లో ఉన్న డ్యాన్సర్ కు దేవరకొండ సాయం!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Vijay Devarakonda Helping To Dance Ikon Show Poor Dancer, Vijay Devarakonda, Ana-TeluguStop.com

కేవలం రియల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రీల్ లైఫ్ లో కూడా కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.కాగా కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచి సహాయం చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే హీరో విజయ్ దేవరకొండ నటించిన లైజర్ సినిమా ఇటీవల ఆగస్టు 25వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.

అయితే లైగర్ సినిమాకు ముందు విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోనే ప్రధాన నగరాలను సందర్శించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా ప్రమోషన్స్ లో భాగంగానే రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నారు విజయ్.ఈ నేపథ్యంలోనే ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ తో పాటు బ్యూటీ అనన్య పాండే కూడా పాల్గొంది.ఈ షోకి టాలీవుడ్ సీనియర్ యాంకర్ ఓంకార్ పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

Telugu Ananya Panday, Dace Icon, Poor Dance-Movie

ఈ విజయ్ దేవరకొండ ఈ షో కి రావడంతో అందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.కాగా అందులో కొంతమంది డ్యాన్స్ చేసి ఆశ్చర్య పోయిన విజయ్ మీలాంటి వాళ్లతో చేస్తే మమ్మల్ని ఎవరూ చూడరు అని స్పందించిన విషయం తెలిసిందే.ఈ షోలో భాగంగా విజయ్ దేవరకొండ ఒక డాన్సర్ పరిస్థితి గురించి తెలుసుకొని షాక్ అయ్యాడు. ఆనంద్ అనే ఒక డాన్సర్ ఎంతో అద్భుతంగా తల్లి పై ప్రేమను చూపించే విధంగా డాన్స్ చేయగా అతని డాన్స్ కు అందరూ కూడా ఫిదా అయ్యారు.

అయితే ఓంకార్ అతని పరిస్థితి గురించి అందరికీ తెలిపాడు.అతని తల్లికి క్యాన్సర్ ఉంది అని కనీసం బట్టలు కొనుక్కోడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో విజయ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు.

ఆ తరువాత డాన్సర్ ఆనంద్ పూర్తి పరిస్థితి తెలుసుకొని ఆ తర్వాత రౌడీ వేర్ నుంచి నీకు ఏది కావాలి అంటే ఆ కాస్ట్యూమ్ తీసుకో అని ఆఫర్ ఇచ్చాడు.డాన్స్ కు తగ్గట్టుగా నువ్వు రౌడీ బ్రాండ్ నుంచి బట్టలు తీసుకోవచ్చు అని చెప్పడంతో అతను చాలా ఆనందపడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube