సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా నెక్స్త్ మంత్ సెట్స్ మీదకు వెళ్లనుంది.హారిక హాసిని క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక సినిమాలో మహేష్ తో పాటుగా మరో హీరో కూడా నటిస్తాడని టాక్.త్రివిక్రం రైటర్ నుంచి డైరక్టర్ గా మారినప్పుడు తను డైరెక్ట్ చేసిన మొదటి సినిమా నువ్వే నువ్వే హీరో తరుణ్ ని మహేష్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
హీరోగా దాదాపు కెరియర్ ముగిసినట్టే అని ఫిక్స్ అయిన తరుణ్ ఇక మీదట వేరే హీరోల సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఈ క్రమంలో మహేష్ సినిమాలో తరుణ్ కూడా నటిస్తాడని చెబుతున్నారు.
అయితే తరుణ్ ఒక్కసారి హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్ చేస్తే మాత్రం ఇక మీదట అతనికి అలాంటి ఛాన్సులు వచ్చేస్తాయి.మరి తరుణ్ త్రివిక్రం సినిమాలో చేస్తాడా లేదా అన్నది చూడాలి.
మహేష్ 28వ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్.అయితే మహేష్ మాత్రం అందుకు నో చెబుతున్నాడని టాక్.







