అట్టర్ ఫ్లాప్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు.గీత గోవిందం సినిమాతో ఆ మార్క్‌ను ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు.

 Vijay Devarakonda Dear Comrade Sensation In Youtube-TeluguStop.com

ఇక డియర్ కామ్రేడ్ సినిమాతో తన రేంజ్‌ను మిగతా భాషల్లో కూడా చాటాలని ప్రయత్నించాడు.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో మనోడి ఆశలు నిరాశగానే మిగిలాయి.

అయితే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించకపోయినా బాలీవుడ్ జనాలు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు.ఈ సినిమాను ఇటీవల హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు బాలీవుడ్ జనం నీరాజనాలు పడుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు యూట్యూబ్‌లో 60 మిలియన్‌కు పైగా వ్యూస్‌ రాగా మిలియన్ లైక్స్ వచ్చాయి.

అంటే ఈ సినిమాను అక్కడి జనం ఎంతగా ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

పక్కా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అవుతున్నారు.

రష్మిక మందన హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశాడు.కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను రెడీ చేస్తు్న్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube