ఇంస్టాగ్రామ్ లో మరో రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ?

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు నటుడు విజయ్ దేవరకొండ.ఈయన మొదటిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Vijay Devarakonda Created Another Record On Instagram, Vijay Devarakonda ,instag-TeluguStop.com

ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే చిత్ర బృందం పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

విజయ్ దేవరకొండకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక ఈయనకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లైగర్ సినిమా విడుదల కాకుండానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈయనకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, సెలబ్రిటీలు సైతం ఈయనకు అభిమానులుగా మారిపోయారు.

ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.ఇక ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ఒకరిగా విజయ్ దేవరకొండ పేరు సంపాదించుకున్నారు.

Telugu @thedeverakonda, Allu Arjun, Alluarjun, Liger, Ligerinstagram-Movie

ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కు 18 ప్లస్ మిలియన్ ఫాలోవర్స్ ఉండగా విజయ్ దేవరకొండ తదుపరి స్థానంలో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన17 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని ఇంస్టాగ్రామ్ లో మరో రికార్డు సృష్టించారు.ఈ క్రమంలోనే 17 మిలియన్ ఫాలోవర్స్ అంటూ విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలా ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి పోటీగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో మాత్రం వెనుకబడినట్టు తెలుస్తుంది.అల్లు అర్జున్ కు ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, విజయ్ దేవరకొండకు కేవలం 3.1 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube