ఖుషి సినిమా ( Kushi Movie )సూపర్ హిట్ అయిన నేపథ్యం లో తన అభిమానులకు కోటి రూపాయల సహాయం ను ఇచ్చేందుకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.వంద కుటుంబాలకు తన వంతు సహాయం ను అందించబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఈ సమయంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూటర్( World Famous Lover Distibutor ) అయిన అభిషేక్ నామా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.ఆ సినిమా వల్ల తాము 8 కోట్ల రూపాయలను నష్ట పోయాం.
కనుక తమకు కూడా సహాయం చేయాలని కోరాడు.అయితే ఈ విషయం లో రౌడీ స్టార్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తూ అభిషేక్ నామా ను టార్గెట్ చేస్తున్నారు.
బుద్ది ఉందా నీకు అంటూ బూతులు తిడుతూ మరీ అభిషేక్( Abhishek Nama ) ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నష్టం వస్తే ఎక్కడైనా హీరో చెల్లిస్తాడా.అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఇన్నాళ్ల తర్వాత హిట్ కొట్టినందుకు కడుపు మంటగా ఉన్నట్లుంది అంటూ రౌడీ స్టార్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.
ఈ సమయంలో రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి కౌంటర్ గా కొందరు నెటిజన్స్ మాట్లాడుతున్నారు.అభిషేక్ నామా ఈ సమయంలో తన ఆవేదన ను వ్యక్తం చేశాడు.
మంచి మనసు చేసుకుని రౌడీ స్టార్ ఏమైనా సహాయం చేస్తాడేమో అనుకున్నాడేమో కానీ ఇతర డిమాండ్ ఏమీ లేదు కదా అంటూ వారు అంటున్నారు.
రౌడీ స్టార్ ( Rowdy Star )ఆ ట్వీట్ కు స్పందించి మీకు జరిగిన నష్టం ను నేను భర్తీ చేయడం సాధ్యం కాదు, కానీ నేను మీ బ్యానర్ లో ఒక సినిమాను చేయగలను అంటూ చెప్పొచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయం లో రౌడీ స్టార్ మంచి మనసును చాటుకుంటే మరింతగా ఆయన గురించి మాట్లాడుకుంటారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి రౌడీ స్టార్ క్రేజ్ కి తగ్గట్లుగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.