కోలీవుడ్ టాప్ హీరో విజయ్( Vijay ) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలోనే అతని కుమారుడు జేసన్ సంజయ్ హీరోగా సినిమాల్లో అడుగుపెట్టనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
నిజానికి గతేడాది విజయ్ మాట్లాడుతూ తన కుమారుడు ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదని అన్నాడు.ఒకవేళ అతడు వచ్చినా దర్శకుడిగానే పరిచయమవుతాడని, ఎందుకంటే అతనికి దర్శకత్వంపై చాలా ఇంట్రెస్ట్ ఉందని అన్నాడు.
అయితే ఇప్పుడు ఆ మాటలకు విరుద్ధంగా జేసన్ సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం సాగుతోంది.

ఆల్రెడీ సంజయ్ ఒక సినిమాకి సంతకం కూడా చేశాడని కోలీవుడ్ ( Kollywood )మీడియా కోడై కూస్తోంది.ఆ సినిమాలో దేవయాని కుమార్తె ఇనయ హీరోయిన్‌గా నటించనుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇనియా ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా సూపర్ పాపులర్ అయ్యింది.
అందుకే ఆమెను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.సంజయ్( Sanjay ) చేస్తున్న మూవీ అజిత్ కుమార్, పార్తిబన్, దేవయాని నటించిన “నీ వరువాయన(1999)’ సినిమాకు సీక్వెల్‌గా వస్తుందని సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి.

దేవయాని భర్త రాజకుమారన్ నీ వరువాయన మూవీని డైరెక్ట్ చేశాడు.ఇప్పుడు సీక్వెల్ కూడా అతనే డైరెక్ట్ చేయనున్నాడని టాక్.ఇకపోతే ప్రస్తుతం జేసన్ సంజయ్( Jason Sanjay ) కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.ఇనియా డిగ్రీ చదువుతోంది.మీ ఇద్దరికీ సినిమాలపై చాలా పిచ్చి ఉంది.ఆ నిజాన్ని గ్రహించిన దర్శకులు వీరి కోసం ఆల్రెడీ కథలు సిద్ధం చేసుకుంటున్నారట.
అలాంటి వాటిలో ఒక కథను సంజయ్ యాక్సెప్ట్ చేశాడని, ఇనియా కూడా ఈ కథకు ఫిదా అయిపోయిందని అంటున్నారు.డైరక్టర్ లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj )తో కూడా జేసన్ సంజయ్ ఒక మూవీ చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
కానీ అధికారికంగా ఈ వార్తలపై ఎలాంటి ప్రకటనలు బయటకు రావడం లేదు.ఒకవేళ ఈ వార్తలు నిజమైతే విజయ్ అధికారికంగా తన కొడుకు సినిమా ఎంట్రీని ప్రకటించే అవకాశం ఉంది.







