తమిళ హీరో విజయ్ ఆంటోనీ( Vijay Antony ) నటించిన బిచ్చగాడు( bichagadu ) సినిమా దాదాపు అయిదు సంవత్సరాల క్రితం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.తమిళం మరియు తెలుగు లో సాధించిన విజయంతో బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ సౌత్ ఇండియాలోనే స్టార్ గా పేరు దక్కించుకున్నాడు.
అందుకే విజయ్ ఆంటోనీ యొక్క బిచ్చగాడు సీక్వెల్ బిచ్చగాడు 2( bichagadu2 ) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.కానీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.
అలాగే సినిమా ఆహా ఓహో అంటూ హిట్ టాక్ కాకున్నా ఫ్లాప్ టాక్ కూడా రాలేదు.దాంతో సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
బిచ్చగాడు సినిమాను అప్పట్లో థియేటర్ లో చూసిన వారు.ఇప్పటికి టీవీ ల్లో చూసిన వారు బిచ్చగాడు 2 సినిమా ను థియేటర్ లో చూసేందుక క్యూ కట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ ల నుండి బిచ్చగాడు సినిమా కు సాలిడ్ షేర్ వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది.

విజయ్ ఆంటోనీ పెద్దగా తెలియకున్నా కూడా బిచ్చగాడు అనే టైటిల్ కారణంగా సినిమా నడిచేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ని రూ.7 కోట్లకు అమ్మేసిన విజయ్ ఆంటోనీ అంతకు మించి వసూళ్లు సాధిస్తున్నట్లుగా తెలుస్తోంది.మొదటి మూడు రోజుల పాటు ఈ సినిమా సాలిడ్ గానే వసూళ్లు రాబట్టింది.కనుక ముందు ముందు ఎలా ఉంటుందో అనే అనుమానం ను కొందరు వ్యక్తం చేశారు.
సోమ వారం కూడా మంచి వసూళ్లు సాధించింది.వీక్ డేస్ లో స్ట్రాంగ్ వసూళ్లు నమోదు అవుతున్న కారణంగా ఈ వీకెండ్ వరకు మంచి వసూళ్లు నమోదు చేసి దాదాపుగా పది కోట్ల వసూళ్ల వరకు సాధించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముందు ముందు బిచ్చగాడు 2 సినిమా తెలుగు లో సంచలనం నమోదు చేయడం ఖాయం అనిపిస్తుంది.