తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మాస్టర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో విలన్ పాత్రలో మరో స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.దీనికి తగ్గట్టుగానే ఇటీవల ఈ సినిమా పోస్టర్ రిలీజ్ కావడంతో మాస్టర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి, విజయ్‌ల మధ్య జరిగే ఫైట్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక వీరిద్దరి మధ్య సాగే క్లైమాక్స్ ఫైట్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోనుందట.
దీనికి సంబంధించిన షూటింగ్‌ను తమిళనాడులోని నెయ్వెలి కోల్ మైన్స్‌లో జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇదే భారీ యాక్షన్ ఎపిసోడ్ అని తెలుస్తోంది.
ఏదేమైనా ఇద్దరు స్టార్ నటుల మధ్య జరిగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు ఇంత ప్రాముఖ్యత ఉందంటే ఈ సీన్‌ను దర్శకుడు ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.ప్రస్తుతం వీరిద్దరి మధ్య నడిచే ఫైట్ సీక్వెన్స్ కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.