కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్( Dalapati Vijay ) జోసెఫ్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.అందుకే తన సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటారు.
మరి దళపతి విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanakaraj ) దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమా నుండి ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంటే ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు పెరిగి పోతున్నాయి.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తానికి ఒకే ఒక్క సాంగ్ ఉంటుందట.ఈ సాంగ్ విజయ్ పాత్ర ఎలివేషన్ కోసమే అని త్రిష ( Trisha )హీరోయిన్ అయినప్పటికీ కంటెంట్ లో భాగంగానే ఆమె పాత్ర ఉంటుందట.24 బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్ బీట్స్ ను లియో కోసం సిద్ధం చేసారని ఈ బీట్స్ థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని కోలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతుంది.
విక్రమ్, జైలర్ సినిమాలకు అనిరుద్( Anirudh ) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ప్లస్ అయ్యిందో ఈ సినిమాకు అంతకు మించి అనేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సిద్ధం చేశారట.ఇదే నిజమైతే ఈసారి లియో సినిమాతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అట.ఇక జైల్లర్ కలెక్షన్స్ ను కూడా బీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.చూడాలి ఏం జరుగుతుందో.
ఇక సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.