కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార( Nayanatara ) , విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటే తమకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ముఖ్యంగా విగ్నేష్ తన కుటుంబానికి తన పిల్లల విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా నయనతార తల్లి ( Nayanatara Mother ) పుట్టిన రోజు కావడంతో విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా నయనతార తల్లికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
నయనతార తల్లి పుట్టిన రోజు( Birth day ) సందర్భంగా ఆమెతో కలిసి నయనతార విగ్నేష్ దిగిన కొన్ని ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి విగ్నేష్ అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…హ్యాపీ బర్త్ డే అత్తమ్మ.నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను.మీరే నా బలం.మీ ప్రార్ధనలు, దీవెనలు మా జీవితాన్ని అందంగా చేస్తున్నాయి.నా నుంచి మరియు నయన్, ఉయర్, ఉలగం నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈయన నయనతార తల్లికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా నయనతార తన తల్లితో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఇక నయనతార తల్లి వయసు పై పడటంతో ఆమె నయనతార పెళ్లి వేడుకలలో కూడా కనిపించలేదు.అయితే పెళ్లయిన వెంటనే నయనతార దంపతులు ఆమె వద్దకు వెళ్లి తన ఆశీర్వాదం తీసుకున్నారు.ఇలా వయసు పై బడటం చేత పెద్దగా బయట కూడా ఎక్కడ కనిపించరు.ఇలా నయనతార తల్లితో కలిసి దిగిన ఫోటోలను విగ్నేష్ షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇక నయనతార పెళ్లి చేసుకున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె బ్లాక్ పోస్టర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమాతో ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.