స్టార్ హీరో మూవీ నుండి తప్పుకున్న డైరెక్టర్.. అఫిషియల్ గా కన్ఫర్మ్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.ఈయన తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగు తున్నారు.

 Vignesh Shivan Out From Ajith Kumar S Ak62, Ak62, Ajith Kumar, Vignesh Shivan, K-TeluguStop.com

కోలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుని తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక అజిత్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి.

దీంతో ఈయనకు ఇక్కడ కూడా కొద్దిగా మార్కెట్ అయితే ఏర్పడింది.పండుగ సీజన్స్ లో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే ఉంది.

ఇక తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘తునివు‘ సినిమా ఈ విషయాన్నీ నిరూపించింది.తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది.అలాగే తమిళ్ లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పొంగల్ రేస్ లో నిలిచి మంచి విజయం సాధించింది.

మరి ఈ సినిమా భారీ లాభాలను కూడా తెచ్చిపెట్టింది అని కోలీవుడ్ మీడియా చెబుతుంది.

Telugu Ajith Kumar, Ak, Vinod, Kollywood, Thunivu, Vignesh Shivan, Vigneshshivan

ఇలా తునివు సినిమా అజిత్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత అజిత్ తన కెరీర్ లో 62వ సినిమాను చేస్తున్నాడు.మరి ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో ఈ సినిమా ప్రకటన రాగానే భారీ హైప్ నెలకొంది.మరి విజయ్ 62వ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.

Telugu Ajith Kumar, Ak, Vinod, Kollywood, Thunivu, Vignesh Shivan, Vigneshshivan

ఈ సినిమా అనౌన్స్ తర్వాత కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.ఈ సినిమా నుండి విగ్నేష్ శివన్ తప్పుకుంటున్నట్టు వేరే డైరెక్టర్ ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్టు టాక్ వచ్చింది.మరి ఈ రూమర్స్ ఇప్పుడు విజమే అని విగ్నేష్ క్లారిటీ ఇచ్చాడు.విగ్నేష్ శివన్ సోషల్ మీడియా బయోలో అజిత్ 62 పేరు పెట్టుకున్న విషయం విదితమే.

కానీ దీనిని తాజాగా తొలగించి అప్డేట్ చేయడంతో ఈ సినిమా నుండి ఈయన తప్పుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.మరి అజిత్ సినిమాకు కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube