సాధారణంగా మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.అయితే ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల వేధింపులు మాత్రం ఆగటం లేదు.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మహిళలు రాణించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ప్రముఖ నటీమణులు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు.
తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్( Vidya Balan) కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ.తాను ఫేస్ చేసిన సంఘటనల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

తాజాగా క్యాస్టింగ్ కౌచ్(Casting couch )పై స్పందించిన విద్యాబాలన్ తాను కూడా గతంలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపింది.అయితే అదృష్టవశాత్తు తెలివిగా దాన్నుంచి బయటపడినట్టు వెల్లడించింది.మహిళలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు ఎన్నో భయానక సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే మా పేరెంట్స్ భయపడి నన్ను సినిమాల్లోకి పంపించడానికి ఇష్టపడలేదు.అయితే ఇప్పటి వరకు తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదుగానీ, ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓ యాడ్ షూట్ కోసం చెన్నైకి (Chennai)వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు.ఆ టైమ్‌లో నేను ఒక్కదాన్నే ఉన్నా, భయపడుతూనే రూమ్‌కి వెళ్లాను.అయితే అక్కడికి వెళ్లిన వెంటనే తెలివిగా వ్యవహరించి గది తలుపులు తెరిచే పెట్టాను.అతడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.అలా సమయస్ఫూర్తితో వ్యవహరించి నన్ను నేను రక్షించుకున్నా` అని విద్యాబాలన్ వెల్లడించింది.క్యాస్టింగ్ కౌచ్‌కి సంబంధించి తనకు ఎదురైన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని.
విద్యాబాలన్ తెలిపింది.కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో, ఇటు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.







