వీడియో: ఏందయ్యా ఇది.. హిప్పోను ఎంత ధైర్యంగా కొట్టాడో చూడండి...

జూలో ఒక సెక్యూరిటీ గార్డు హిప్పోను( Hippo ) ఏదో కుక్క పిల్ల లాగా కొట్టి వెనక్కి పంపించాడు.సదురు గార్డు హిప్పోను తిరిగి దాని ఎన్‌క్లోజర్ లోకి నెడుతున్న దృశ్యాలకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది.

 Video What's This Watch How Bravely He Beat The Hippo, Viral News, Latest News,-TeluguStop.com

హిప్పో బయటికి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, దానిని వెనక్కి వెళ్లేలా చేయడానికి గార్డు దానిని కొట్టాడు.ఆ సమయంలో కోపానికి గురైన హిప్పో దాని నోరు విశాలంగా తెరిచింది, కానీ గార్డు అది తిరిగి కిందకు దిగి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళే వరకు దానిని చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి కొంతమంది గార్డు భద్రత గురించి ఆందోళన చెందారు, మరికొందరు జంతువును కొట్టడం తప్పు అని అన్నారు.కానీ ఇతర వ్యక్తులు మాత్రం గార్డు తన పని తాను చేస్తున్నాడని, హిప్పో అతనిపై దాడి చేసి ఉంటే అతను తీవ్రంగా గాయపడి ఉండేవాడని చెప్పారు.

ఈ ఘటన భారతదేశంలోని ( India )ఒక జూలో చోటుచేసుకుంది.ఈ వీడియోను ఘర్ కా ఖలేష్( Ghar Ka Khalesh ) అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది.ఇది వేల వ్యూస్‌ పొందింది.ఇకపోతే హిప్పోలు మానవులకు హాని కలిగిస్తాయి.అవి ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన భూమి క్షీరదంగా ఎండ పేరు తెచ్చుకున్నాయి.ఈ ఖండంలోని ఇతర పెద్ద జంతువుల కంటే ఎక్కువ మానవ మరణాలకు ఇవి కారణమవుతాయి.

హిప్పోలు చాలా దూకుడుగా ఉంటాయి.అవి మానవుల నుంచి ప్రమాదం ఉందని అనిపిస్తే వారిపై దాడి చేస్తాయి.

హిప్పోలు పెద్ద, శక్తివంతమైన దవడలు, దంతాలను కలిగి ఉంటాయి.అవి ఒకే కాటుతో మానవ పుర్రెను సులభంగా చూర్ణం చేయగలవు.

ఇవి చాలా వేగంగా ఉంటాయి.చురుకైనవి, వారు మానవుడిని ఈజీగా వెంటాడి చంపగలవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube