అర్ధరాత్రి సమయంలో ఢిల్లీ( Delhi )లో ఓ ప్రమాదం సంభవించింది.వసంత్ కుంజ్( Vasant Kunj ) ప్రాంతంలోని ఓ మాల్ లో సెంట్రల్ హాల్ లో సాధారణ పనుల నిమిత్తం పై కప్పు నిర్వహణ పనుల కారణంగా జరుగుతున్న పనుల సమయంలో పైకప్పు లోని కొంత భాగం ఒక్కసారిగా కూలిపోయింది.
అయితే ఈ సంఘటన అర్ధరాత్రి 12: 45 గంటల సమయంలో జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

ఈ సంఘటన జరిగిన తర్వాత సదరు ఏరియా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.వారు చెప్పిందాని ప్రకారం.మాల్ సెంట్రల్ హాల్ లో పైకప్పు పాక్షికంగా కూలిపోయిందని., అందుకు సంబంధించిన శిథిలాలు సెంట్రల్ హాల్( Central Hall ) లో చుట్టూ ఎక్కడపడితే అక్కడ చెల్లాచెదురుగా పడ్డాయని తెలిపారు.అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ., ప్రాణహాని కానీ.
జరగలేదని ఇందుకు సంబంధించిన పూర్తి విచారణ అతి త్వరగా జరుపుతామని తెలియజేశారు.అయితే ఈ సంఘటన జరుగుతున్న సమయంలో రికార్డ్ అయిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియోలో కూలిపోయిన పైకప్పు నుండి వచ్చిన శిధిలాలు రైలింగ్, ఎక్సలేటర్ల పై పడినట్లు స్పష్టంగా కనబడుతోంది.ఈ కారణం చేత నిర్వహణ పనులు పూర్తి చేయడం కోసం ముందు జాగ్రత్త చర్యగా మాల్ ను ఓ రోజు పాటు పూర్తిగా మూసేశామని., నిర్వాహన పనులు పూర్తయిన తర్వాతనే తిరిగి మాల్ తెరవనున్నట్లు మాల్ నిర్వాహకులు తెలియజేశారు.







