వీడియో: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. పిచ్‌పైనే కుప్పకూలాడు..

ఈ రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామందికి గుండెపోట్లు వస్తున్నాయి.వీటివల్ల అప్పటిదాకా మంచిగా ఉన్నవారు ఒకేసారి నేలపై కుప్ప కూలిపోయి ప్రాణాలను విడుస్తున్నారు.

 Video: Heart Attack While Playing Cricket He Collapsed On The Pitch, Viral Vide-TeluguStop.com

వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయి చాలా మందికి విచారాన్ని కలిగించాయి.తాజాగా ఈ కోవకు చెందిన మరొక విషాదకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక ఇంజనీర్ క్రికెట్( Cricket ) ఆడుతూ గుండెపోటుతో మరణించాడు.ఆటగాడి పేరు వికాస్ నేగి.

అతనికి 34 సంవత్సరాలు ఉన్నాయి.వికాస్ బ్లేజింగ్ బుల్స్‌( Vikas )తో మావెరిక్స్ XI తరఫున ఆడుతున్నాడు.

వికాస్ తన జట్టు ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.14వ ఓవర్‌లో అతడు ఒక ఫోర్ కొట్టి పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు.తన పార్టనర్ ఉమేష్ కుమార్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు.కానీ ఒక్కసారిగా నేలపై పడిపోయాడు.అతనికి గుండెపోటు( Heart attack ) వచ్చింది.ఇతర ఆటగాళ్ళు అతని వద్దకు పరిగెత్తారు, అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించారు.

వారు అతన్ని కారులో ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది.

వికాస్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

వైరల్ వీడియోలో అతడు నడుచుకుంటూ వెళ్లి పిచ్ పైనే కింద పడిపోతున్నట్లు కనిపిస్తోంది.ఈ దృశ్యాలు చూసి వికాస్ భాగస్వామి, ఇతర ఆటగాళ్లు షాక్ అయ్యారు.సీపీఆర్‌ చేసి అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు.

వాళ్ళు అతడ్ని పైకి లేపి కారు ఎక్కించారు.కానీ అతను బతకలేదు.

అతను చనిపోయే ముందు బాగా ఆడాడు.ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేశాడు.అతని జట్టు స్కోరు 13.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube