వీడియో: నడిరోడ్డుపై కొట్లాట.. ఒకరు పెంపుడు కొండచిలువతో దాడి..

టొరంటోలో ( Toronto )తాజాగా ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.

ఈ ఘటనలో 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఉపయోగించి ఇంకొక వ్యక్తిపై దాడి చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.టొరంటో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన మే 10న రాత్రి 11:50 గంటలకు డుండాస్ స్ట్రీట్ వెస్ట్( Dundas Street West ), మానింగ్ అవెన్యూ కూడలి వద్ద జరిగింది.ఆ వ్యక్తి బాధితుడి వద్దకు రావడంతో శారీరక దాడి జరిగింది.

గొడవ సమయంలో వ్యక్తి తన పెంపుడు కొండచిలువను ఆయుధంగా ఉపయోగించి అవతలి వ్యక్తిపై దాడి చేశాడు.

Video Fight On The Road One Attacked With A Pet Python, Toronto, Python Attack,

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను క్రేజీ క్లిప్స్ అనే ట్విట్టర్‌ అకౌంట్‌ షేర్ చేసింది.ఈ వీడియోలో, వ్యక్తి తన కొండచిలువతో అవతలి వ్యక్తిని కొట్టడం చూడవచ్చు.ఘటనా స్థలానికి టొరంటో పోలీసులు వచ్చే వరకు వీరిద్దరూ కొట్టుకుంటూనే ఉన్నారు.

Advertisement
Video Fight On The Road One Attacked With A Pet Python, Toronto, Python Attack,

పోలీసులు వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి పామును నేలపై పడేశాడు.తరువాత అతన్ని అరెస్టు చేశారు.

Video Fight On The Road One Attacked With A Pet Python, Toronto, Python Attack,

ఒక రోజు క్రితం పోస్ట్ చేయబడిన వీడియో ఇప్పటికే 50 లక్షలకు పైగా వ్యూస్‌ సంపాదించింది.పెంపుడు పాముతో అలా ప్రవర్తించడం ఏం బాగోలేదని జంతు ప్రేమికుల పెదవి విరిచారు.ప్రమాదకరమైన పాముతో క్యాజువల్‌గా తిరుగుతున్న వ్యక్తి ప్రవర్తనను మరికొందరు ఎత్తిచూపారు.

మూడవ వ్యాఖ్యాత పాములు, పక్షులను పెంపుడు జంతువులుగా ఉంచడాన్ని ఖండించారు, అసహ్యం వ్యక్తం చేశారు.కాగా ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని లీగల్‌గా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరారు.

ఈ సంఘటనను టొరంటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు