చిన్నారిని బొమ్మలా గాల్లో ఎగిరేసిన అడవి దున్న.. షాకింగ్ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక చిన్నారిపై ఒక భారీ అమెరికన్ అడవి దున్న ( Bison ) హింసాత్మకంగా దాడి చేసింది.

 A Wild Ploughshare That Blew A Child Like A Toy In The Wind Shocking Video Vira-TeluguStop.com

ఈ సంఘటన చూసి షాక్ అవడం అందరి వంతు అయింది.దీనికి సంబంధించి టెర్రిఫైయింగ్ నేచర్ ( Terrifying nature )అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ గానూ మారింది.

ఈ వీడియో పదుల సంఖ్యలో ప్రజలు తిరుగుతున్న ప్రాంతంలో ఆ దున్నపోతు శాంతియుతంగా మేస్తున్నట్లు చూపిస్తుంది.

వీడియోలో కనిపించినట్లుగా.అలా మేస్తూనే అది అకస్మాత్తుగా పైకి చూసి, ముందుకు దూసుకుపోతుంది.కళ్ళు మూసి తెరిచేలోగా ఆ భారీ దున్నపోతు తన తలతో ఒక చిన్నారిని గాలిలోకి చాలా అడుగుల దూరం విసిరింది.

ఇది చూసి అక్కడే ఉన్న కొంతమంది చిన్నారులు భయంతో పరుగులు తీశారు.ఈ వీడియో క్లిప్‌ను “బైసన్ అటాక్స్ చైల్డ్” ( Bison Attacks Child )అనే టైటిల్‌తో ట్విట్టర్ పేజీ టెర్రిఫైయింగ్ నేచర్ షేర్ చేసింది.

వీడియో చూస్తుంటే ఆ చిన్నారికి తీవ్ర గాయాలు తగిలినట్లు స్పష్టమవుతుంది.ఈ శారీరక గాయాలే కాకుండా ఆ బాలిక ఈ ఎటాక్ వల్ల మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది.

ముఖ్యంగా ఆమెలో భయం విపరీతంగా పెరిగి ఉంటుంది.

బైసన్ అనేది చాలా దూకుడుగా ఉండే ఒక అడవి జంతువు దీనిని ఎవరూ కూడా పెంచరు.ఎక్కువగా ఉత్తర అమెరికాలో( North America ) కనిపించే ఈ బర్రెలను కొన్ని సందర్భాలలో బంధిస్తారు.అనూహ్య ప్రవర్తన కలిగిన వీటికి దగ్గరలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలను వీటి దగ్గరకు అసలు పంపించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube