వీడియో: సూపర్ మార్కెట్లో సరుకులు కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన మహిళలు.. చివరికి..

దొంగలకు మొబైల్ ఫోన్ నుంచి సూపర్ మార్కెట్ల వరకు అన్ని షాపులు ఎప్పుడూ టార్గెట్ అవుతుంటాయి.సీసీటీవీ కెమెరాలు షాప్ అంతటా ఉన్నా సరే ముసుగులు వేసుకొని, బుర్కాలు ధరించి వీరు దొంగతనాలకు పాల్పడుతుంటారు.

 Video: Female Thi Eves Caught While Shopping In The Supermarket In The End, L-TeluguStop.com

కానీ యజమానులు అప్రమత్తంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు దొరికిపోతుంటారు.ఆ సందర్భంలో షాపు ఓనర్లు లేదా మేనేజర్లు దొంగలించిన సరుకులన్నీ బయట పెట్టాలని బలవంతం చేస్తారు.

కొడుతూ తిడుతూ బాగా హింస పెడతారు.దొంగలకు( Thieves ) తగిన శాస్తి జరిగితేనే మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు పునరావృతం చేయరని వారు అలా చేస్తారు.

అయితే తాజాగా ఇలాంటి ఒక అనుభవం ఇద్దరూ మహిళా దొంగలకు ఎదురైంది.వీరిద్దరూ బూర్కాలు ధరించి ఒక సూపర్ మార్కెట్లో( Supermarket )కి ప్రవేశించారు.అనంతరం తమ చేతులకు పని చెప్పారు.కానీ వారి రోజు బాగోలేక యజమానికి దొరికిపోయారు.అంతే వారిని షాపు వర్కర్లు దారుణంగా కోరుతూ దొంగలించిన సొమ్మంతా బయట పెట్టించారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది./br>

ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియ రాలేదు.కానీ అందులో తెలుగు వారు మాట్లాడుతున్నట్లు వినిపించింది.“ఇన్ని ఐటమ్స్ పోతుంటే ఏం చేస్తున్నారు రా, మీరు?” అని ఒక ఉద్యోగి లేదా ఓనర్ అరిచినట్లు వీడియోలో వినిపించింది.దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో( Twitter ) షేర్ చేశారు.

ఆ వీడియోలో దొరికిపోయిన లేడీ దొంగలు బాగా ఏడుస్తూ కనిపించారు.ఒక దొంగ తన ముఖం చూపించడానికి అసలు ఇష్టపడలేదు.

ముఖం దాచుకోవడానికి బాగా ఇబ్బంది పడింది.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube