వీడియో: పట్టాలు దాటుతుండగా తృటిలో తప్పిన ప్రమాదం... అందుకే తొందరపడొద్దు అనేది!

మనలో అనేకమంది ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు చాలా తొందరపడిపోతూ వుంటారు.కాస్త లేటయితే యేవో కొంపలు మునిగిపోతాయేమో అన్నట్టుగా ప్రవర్తిస్తూ వుంటారు.

 Video: A Near Miss While Crossing The Tracks That's Why Don't Be In A Hurry , Tr-TeluguStop.com

ట్రాఫిక్ సిగ్నల్స్ దాటి వెళ్లిపోవడం, ముందున్న బళ్లను క్రాస్ చేయడానికి ట్రై చేయడం వంటివి చేస్తూ వుంటారు.ఇంకొంతమందైతే రెయిల్వే గేట్ వేసివున్నా సరే దానికిందనుండి వెళ్లిపోవడానికి తెగ ట్రై చేస్తూ వుంటారు.

కాస్త వెయిట్ చేస్తే, వాళ్ళ సొమ్మేమైనా పోతుందా అని మనకి అనిపించకమానదు.అయితే ఇలాంటి సాహసాల వలెనే అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

ఈ సంగతంతా ఎందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.తాజాగా ఓ ప్రబుద్దుడు తన కారుతో సహా రైలు పట్టాలు దాటడానికి అత్యుత్సాహం చూపించాడు.

దాంతో అతగాడికి చుక్కలు కనబడ్డాయి.ఇలా చేసినపుడు కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

అదృష్టవశాత్తు మనోడు తప్పించుకున్నాడు.లేదంటే బాడీ పీస్ పీస్ అయిపోయేదే.

వివరాల్లోకి వెళితే… ఈ వీడియోలో రైలు పట్టాలు దాటేందుకు రైల్వే గేట్ లేదు.కానీ ఒక వ్యక్తి మాత్రం తన కారుతో పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తాడు.

అయితే అనుకోకుండా కారు ఇరుక్కుపోతుంది.

ఓ వైపునుండి రైలు దూసుకుంటూ వచ్చేస్తుంది.

దాంతో అతను వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి వెళ్లిపోతాడు.అదే సమయంలో అక్కడికి ఓ రైలు వేగంగా దూసుకొస్తుంది.

అంతే క్షణాల్లో కారు ముక్కలుముక్కలు అయిపోతుంది.ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది.19 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 13 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇది మూర్ఖత్వం అని కొందరంటే, రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సలహాలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube