తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన టువంటి అసురన్ చిత్రం ఎంత మంచి విజయం సాధించిందో మనందరికీ బాగా తెలుసు.అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల “నారప్ప” అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియామణి, రెబ్బ మౌనిక జాన్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం ప్రస్తుతం తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
అయితే మొన్నటి వరకు ఎర్రటి ఎడారిలో పలు యాక్షన్ సీన్లను వెంకటేష్ తో కలిసి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.ఇందుకు గాను ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నటి ప్రియమణి కూడా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటోంది.
అలాగే పలు ఎమోషనల్ సీన్లు చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.