నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం శ్రీ వైయస్ జగన్.నర్సీపట్నం పర్యటలో వివిధ రకాల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసిన బాధితులు.
బాధితులు, వారి బంధువులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న సీఎం.తక్షణమే వారి వైద్యం కోసం రూ.1లక్ష మంజూరు చేస్తూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన సీఎం.ముఖ్యమంత్రి ఆదేశాలతో అనారోగ్య బాధితులకు రూ.1లక్ష అందజేసిన జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి.
అమర్త్య రామ్
నాతవరం మండల కేంద్రానికి చెందిన దేవరకొండ అమర్త్య రామ్ పుట్టినప్పటినుంచి పి ఆర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు.రెండు సంవత్సరాల ఆదిత్య రామ్ నాలుక లోపలికి వెళ్ళిపోయి ఊపిరి సలపని వ్యాధితో బాధపడుతున్నందున తల్లిదండ్రులు తమిళనాడులోని నాగరకోయిల్ ఆసుపత్రిలో చూపించి చికిత్స చేయిస్తున్నారు.ఇప్పటివరకు సుమారు రూ.7.5 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు.తగిన ఆర్ధిక స్థోమత లేకపోవడంతో చికిత్స చేయించడానికి ఇబ్బంది పడుతున్నామని సీఎం దృష్టికి తీసుకురాగా… మెరుగైన వైద్యం కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పాము ప్రసాద్
రావికమతం మండలం జెడ్ కొత్తపట్నం గ్రామానికి చెందిన పాము ప్రసాద్ సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నారు.వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.వైద్యం కోసం తక్షణ ఆర్ధిక సాయంతో పాటు మెరుగైన వైద్యం కూడా అందించాలని సీఎం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

మల్ల రోహిత్
కసింకోట మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన మల్ల రోహిత్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని, ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని రోహిత్ తల్లిదండ్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రి స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.తమ సమస్యపై ముఖ్యమంత్రే నేరుగా ఇంత వేగంగా స్పందించడం మర్చిపోలేమన్నారు.