అణచివేత, అస్పృశ్యత, అంటరానితనం వంటి వాటిని సినిమాలుగా మలిచిన గొప్పతనం కేవలం 80ల్లో ఉన్న దర్శకులకు మాత్రమే చెల్లింది.ఇలాంటి తరహా సినిమాలు జనాల్లో ఎంతో చైతన్యాన్ని కలిగించాయి.
వాటి ప్రభావం ఇప్పటికి అనేక సినిమాల్లో ఉంటుంది.ఈ అంశాల రిఫరెన్స్ తో వచ్చిన సినిమాల్లో రియాలిటీ కూడా కనిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటికి పెద్దగా గుర్తింపు లేదు కానీ నాని హీరో గా వచ్చిన దసరా సినిమాలో( Dasara ) ఆ తాలూకా ప్రభావం కనిపించింది.అంతే కాదు దసరా సినిమా దార్శకుడిపై ఎర్ర మందారం సినిమా ప్రభావం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది.

ఆ చిత్రంలో ఉన్నట్టుగానే దసరా చిత్రంలో విలన్ కనిపిస్తుంటాడు.కథ కూడా దాదాపు అలాగే ఉంటుంది.ఇక ఎనభై దశకం ఇలాంటి సినిమాలకు పెట్టింది పేరు.ఆర్.నారాయణ మూర్తి, టి.క్రిష్ణ, మాదాల రంగారావు, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకులు అణిచివేతను చాల గొప్పగా చూపించడంలో విజయవంతం అయ్యారు.నిజానికి వీరు మహాదర్శకులు, మంచి దార్శనికులు.తెగించి ఇలాంటి సినిమాలు ఈ దర్శకులు చేయకపోయి ఉంటె ఈ రోజు ఇంత బలమైన గొంతుకలు ఉండేవి కావు.చాల ఏళ్లుగా తమిళులతో పోలిస్తే తెలుగులో మంచి రియలిస్టిక్ సినిమాలు రావడం లేదు అనే అపవాదు కనిపిస్తూనే ఉంది.

ఇక అసురన్ లాంటి సినిమా పెద్ద గొప్ప సబ్జెక్టు ఏమి కాదు.ప్రతి రోజు న్యూస్ పేపర్ చదివే వాళ్లకు ఎన్నో ఇలాంటి వార్తలు తారసపడుతూనే ఉంటాయి.కానీ ఎంత చిన్న కథను అయినా రక్తి కట్టించడం దర్శకుడి చేతిలో ఉంటుంది.
అందులో ఉండే ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్, రియాలిటీ తగ్గకుండా చూపించడమే అసలు ఛాలెంజ్ .అందులో అసురన్ దర్శకుడు వెట్రిమారన్ సక్సెస్ అయ్యాడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.వెట్రిమారన్ జీవితం వెలివేతల నుంచి విప్లవ శంఖారావం వరకు కొనసాగింది.అది ఉన్నది ఉన్నట్టుగా చూపించడానికి ఒక యుద్ధం చేస్తాడు కథతో.

అతడిది ఒక భిన్నమైన శైలి.సినిమాను తెరక్కెక్కించే ముందు లోతైన విశ్లేషణ అతడికి ఎంతో ముఖ్యమైనది.సాహిత్యం తో కూడా సినిమాను నిలబెట్టగలడు.సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపుతాడు.వ్యవస్థను ప్రశ్నించడం లో ఎలాంటి బెరుకు లేదు.ఇక నేడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi ) తో తీసిన విడుదల సినిమా చూస్తే వెట్రిమారన్ వేర్పాటు వాదంపై ఎలాంటి చిత్రాన్ని తీసాడో తెలుస్తుంది.