చెట్లు అనగానే మంచి ఆక్సిజ( Oxygen )న్ ను అందిస్తాయి.గాలిని అందించి మనుషులు బ్రతకడానికి ఉపయోగపడతాయి.
ఇక ఎండాకాలంలో నీడను, వర్షాకాలంలో తలదాచుకోవడానికి సహాయపడతాయి.అలాగే మనిషి తినడానికి పండ్లు, కూరగాయలు అందించే చెట్లు ఉన్నాయి.
ఇక పచ్చగా కనిపిస్తూ మంచి ప్రకృతిని చెట్లు అందిస్తాయి.పచ్చటి చెట్ల మధ్య గడిపితే మానసిక ప్రశాంతతో పాటు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
దీంతో చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలను చాలామంది సందర్శిస్తూ ఉంటారు.
అయితే మొక్కలనగానే అందరికీ మనకు మేలు చేసేవి గుర్తుకొస్తాయి.
కానీ మనకు హాని చేసే చెట్లు కూడా కొన్ని ఉన్నాయి.విషపూరితమైనవి చాలా చెట్లు ప్రపంచంలో ఉన్నాయి.
ఇవి మనిషిని ఆత్మహత్య( Suicide ) చేసుకునేలా ప్రేరేపిస్తాయి.దీంతో వీటిని ప్రమాదకరమైన మొక్కలుగా చెబుతారు.
అందులో ఒక మొక్క పేరే జిపీ-జింపీ( Gympie-Gympie ).ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కగా దీనిని గుర్తించారు.ఉర్టికేసి రేగుట కుటుంబానికి చెందిన ఈ మొక్కలు. ఆస్ట్రేలియా( Austra ), ఇండోనేషియాలోని అడవుల్లో ఎక్కువగా ఉంటాయి.ఈ మొక్కలు మనం ఆత్మహత్య చేసుకునేలా ఆలోచనలను కలిగిస్తాయి.మనుషులకే కాదు జంతువులకు కూడా దీని వల్ల హాని కలుగుతుంది.
1866లో ఈ మొక్కను కొనుగొన్నారు.ఆ సమయంలో ఒక గుర్రం ఈ మొక్కను తాకింది.
కొద్దిసేపటికే అది మతిస్థిమితం కోల్పోయి మరణించినట్లు చెబుతున్నారు.అయితే అత్యంత ప్రమాదకరమైన ఈ మొక్కను యూకేకు చెందిన బ్రిట్ అనే వ్యక్తి తన పెరట్లో పెంచుకుంటున్నారు.
ఈ మొక్కను తాకినప్పుడు చర్మం మండటంతో పాటు కరెంట్ షాక్ తగిలినట్లు మనకు అనిపిస్తుంది.ఆ నొప్పి కొన్ని నెలల పాటు ఉంటుంది.
ఈ సమయంలో వ్యక్తి ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంటాడని చెబుతున్నారు.నొప్పి భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది.