సినిమా ఇండస్ట్రీలో చాలామంది జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి( Venu Swamy ).ఈయన ఏదైనా విషయం చెబితే ఉన్నది ఉన్నట్లుగా జరగడంతో ఈయన జోస్యానికి మంచి డిమాండ్ పెరిగింది.
అలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు కూడా ఈయన దగ్గర పూజలు చేయించుకొని స్టార్డం తెచ్చుకున్న వారు ఉన్నారు.అలాంటి వారిలో రష్మిక మందన్న ( Rashmika mandanna ) ఒకరు.
ఇక ఈయన కొంతమంది సినీ సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించి చెప్పారు.అయితే అది ఉన్నది ఉన్నట్లుగా జరగడంతో ఈయన జోస్యం అందరూ నమ్ముతున్నారు.
అయితే ప్రభాస్ హీరోగా చేసిన రీసెంట్ మూవీ ఆదిపురుష్ విడుదల సమయంలో ఈ సినిమా అంతగా హిట్ అవ్వదని వేణు స్వామి ముందే చెప్పారు.

ఇక ఆయన చెప్పినట్లే ఆదిపురుష్ ( Aadi purush ) సినిమా ప్లాఫ్ అయ్యింది.అయితే తాజాగా విడుదలవబోయే సలార్ మూవీ పై కూడా తన రివ్యూ ముందుగానే వేణు స్వామి చెప్పినట్టు మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో సలార్ ( Salaar ) గురించి మాట్లాడుతూ ప్రభాస్ సినీ కెరియర్ ప్రకారం ఈయన తో ఎవరు పెద్ద బడ్జెట్ సినిమాలు చేసినా కూడా కాస్త ఆలోచించుకోవాలి.
ఎందుకంటే ఈయనతో చేసిన సినిమాలు అంతగా ఫలితాన్ని ఇవ్వవు.ఇక సలార్ సినిమా కూడా ఊహించినంత హిట్ అవ్వదు.ఈ సినిమాపై ఎన్ని హోప్స్ పెంచుకున్నా అది వ్యర్థమే.

మీరు ఈ సినిమాపై ఎక్కువ హోప్స్ పెంచుకొని వెళ్తే మాత్రం తప్పకుండా నిరాశ పడతారు.మీరు అనుకున్నంత హిట్టు మాత్రం కాదు అంటూ సలార్ రిజల్ట్ ముందుగానే వేణు స్వామి చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ( Prabhas ) ఖాతాలో మరో ప్లాఫ్ పడ్డట్టే అని ఈయన అభిమానులు భావిస్తున్నారు.
అలాగే రీసెంట్ గా విడుదలైన సలార్ ట్రైలర్ కూడా అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.దాంతో ఈ సినిమాపై కాస్త డౌట్ పడుతున్నారు ఆయన అభిమానులు.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.