అక్కినేని అఖిల్ “అఖిల్” సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలీస్ందే.తొలి సినిమా ఫ్లాప్ కావడంతో అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యారు.
ఈ సినిమా నిర్మాతలకు అటూఇటుగా పాతిక కోట్ల రూపాయల వరకు నష్టాలను మిగిల్చిందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.అయితే ఆ తర్వాత అఖిల్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో నటించిన హలో సినిమా కూడా ఫ్లాపైంది.
మిస్టర్ మజ్ను సినిమాతో అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాడని భావించిన అభిమానులకు ఆ సినిమా ఫలితం కూడా తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ తొలి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా హిట్టైనా చాలామంది ఈ సినిమా అఖిల్ రేంజ్ కు తగిన సినిమా అయితే కాదని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు అఖిల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నారని సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకునే విధంగా అఖిల్ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది.అయితే అఖిల్ కు వరుసగా ఫ్లాపులు రావడానికి ఒక విధంగా ఆయన అమల కారణమని వేణుస్వామి అన్నారు.

అఖిల్ జాతకం ప్రాబ్లమాటిక్ గా ఉందని ఆయన జాతకంలో నాగ దోషం ఉందని అఖిల్ డైరెక్ట్ గా సినిమాలు చేయాలని ఎవరి నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన సూచించారు.ఆయన జాతకంలో తల్లి పాత్ర ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు.తల్లి ఇంపాక్ట్ వల్ల అఖిల్ జీవితం వెనక్కు లాగబడుతుందని అమల వెనక్కి తగ్గితే అఖిల్ కు బెనిఫిట్ కలుగుతుందని తాను జాతకం పరంగా చెబుతున్నానని ఆయన అన్నారు.







