వేణు మాధవ్ దర్శకత్వం లో ఆ స్టార్ హీరో తో సినిమా ప్రారంభించి వదిలేయడానికి కారణం అదేనా..!

మన టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొదవే లేదు, మన ఇండస్ట్రీ లో ఉన్నంత హీరోలు , క్యారక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులతో కేవలం ఇద్దరు ముగ్గురు కమెడియన్స్ మాత్రమే లెజెండ్ స్థానాన్ని సంపాదించుకుంటారు.

 Venu Madhav And Sunil Combo Movie Details, Venu Madhav , Sunil , Tollywood, And-TeluguStop.com

ఎంతో మంది అప్ కింగ్ కమెడియన్స్ కి ఆదర్శంగా నిలుస్తారు, అలాంటి వారిలో ఒకరు వేణు మాధవ్.డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ తో వేణు మాధవ్( Venu Madhav) పుట్టించే కామెడీ కి ఎవరికైనా పొట్ట చెక్కలు కావాల్సిందే.

అందుకే ఆయన అంతటి స్థానాన్ని దక్కించుకున్నాడు.దురదృష్టం కొద్దీ ఆయనకీ లివర్ సమస్య వల్ల ప్రాణాలు కోల్పోయి ఈరోజు మన మధ్య లేడు.

అయినా కానీ అతను పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా ఎప్పటికీ చిరస్థాయిగా చిరంజీవికి గా ఈ భూమి బ్రతికి ఉన్నంత కాలం నవ్విస్తూనే ఉంటాడు.

Telugu Andala Ramudu, Sankranti, Sunil, Tollywood, Venkatesh, Venu Madhav-Movie

ఇది ఇలా ఉండగా వేణు మాధవ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.కేవలం నటన మీదనే కాకుండా దర్శకత్వం మీద కూడా మంచి గ్రిప్ ఉంది.ఒకానొక దశలో ఆయన సన్నివేశాలకు ఆయనే దర్శకత్వం వహించుకునేవాడట.

ఉదాహరణకి రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ మూవీ లో వేణు మాధవ్ ట్రాక్ మొత్తం, స్వయంగా ఆయనే డిజైన్ చేయించుకొని, ఆయన అభిరుచికి తగ్గట్టుగా దర్శకత్వం వహించేవాడట.అలాగే ఛత్రపతి సినిమాలో కూడా ఇంతే, తన ట్రాక్ మొత్తానికి తానే దర్శకత్వం వహించాడు.

ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన సంక్రాంతి సినిమాలో కూడా ఇదే రిపీట్ అయ్యింది.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.అయితే గతం లో వేణు మాధవ్ అప్పుడే వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న ఒక హీరో ని పెట్టి , తానే నిర్మాతగా మారి ఒక సినిమా తియ్యాలనుకున్నాడట.

Telugu Andala Ramudu, Sankranti, Sunil, Tollywood, Venkatesh, Venu Madhav-Movie

ఆ హీరో మరెవరో కాదు, సునీల్.కమెడియన్ ఒక రేంజ్ లో సక్సెస్ అయినా సునీల్ హీరో గా కూడా అదే రేంజ్ లో సక్సెస్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.అప్పట్లో ఆయన హీరో గా నటించిన ‘అందాల రాముడు( Andala Ramudu )’ అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత కూడా సునీల్ కమెడియన్ గా కొనసాగాడు కానీ , అడపాదడపా హీరో గా కూడా నటిస్తూ ఉండేవాడు.అలా వేణు మాధవ్ దర్శకత్వం, సునీల్ హీరో గా అప్పట్లో ఒక ప్రాజెక్ట్ లాక్ అయ్యింది.

సునీల్ వేణు మాధవ్( Sunil ) మీద అభిమానంతో ఆయన ఎన్ని డేట్స్ అడిగితె అన్ని డేట్స్ సర్దుబాటు చేసి ఇచ్చాడు.కానీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ విషయం లో చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి, అలాగే వేణు మాధవ్ కి ఫైనాన్స్ చేసే వాళ్ళు కూడా చివరి నిమిషం లో చేతులు దులుపుకున్నారు, అలా గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది, సునీల్ డేట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube