ఈ మధ్య ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి.ఇంతకు ముందులా కాకుండా కథ కథనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇది వరకు హీరోలను బట్టి ఆ సినిమాలు ఎలా ఉన్న ఫ్యాన్స్ చూసేవారు. కమర్షియల్ గా ఎలిమెంట్స్ జోడించి సినిమాలు తీసిన ఫ్యాన్స్ వాటిని హిట్ చేసేవారు.
కానీ రానురాను ఈ ట్రెండ్ కనుమరుగు అవుతుంది.
ఎందుకంటే రెండు ఫైట్స్, నాలుగు పాటలు, ఒక పది డైలాగులతో సినిమాలు తీసే ట్రెండ్ మారిపోయింది.
ఇలా తీసే సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు.ఎంత పెద్ద హీరో అయిన సినిమాలో కంటెంట్ లేకపోతే ఆ సినిమాను అట్టర్ ప్లాప్ చేయడంలో ముందు ఉంటున్నారు.
అదే సమయంలో చిన్న చిన్న హీరోలు మంచి కంటెంట్ తో వచ్చిన వాటిని సూపర్ హిట్ చేస్తూ ఆడియెన్స్ కు కంటెంట్ మాత్రమే కావాలి అని నిరూపిస్తున్నారు.

తాజాగా మరోసారి ఆడియెన్స్ కు కంటెంట్ కావాలని ”బలగం” సినిమాతో నిరూపించారు.ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన సినిమాల్లో బలగం ఒకటి.ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ఈ సినిమా చాలా మందికి చేరుకుంది.టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా బలగం.

ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా కావడం విశేషం.భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో రిలీజ్ అయ్యింది.ఈ సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచుకుంది.మంచి రివ్యూస్ కూడా రావడంతో ఈ సినిమా ఆడియెన్స్ కు మరింత చేరుకుంది.కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా మరింత బలపడుతుంది.సినిమా చాలా తక్కువ మందికి రీచ్ అయిన చూసిన ప్రతీ ఒక్కరు మాట్లాడుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.
చూడాలి ఈ సినిమా వీకెండ్ లో ఎన్ని కలెక్షన్స్ రాబడుతుందో.







