దగ్గుబాటి వెంకటేష్ ఈ మధ్య తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ మిగతా హీరోలతో పోటీలో వెనకబడిపోయాడు.కానీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెంకటేష్ తాజాగా నటిస్తోన్న వెంకీ మామ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే వెంకీ మామతో తన మేనల్లుడు నాగ చైతన్య కూడా కలిసి నటిస్తుండటం విశేషం.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు అంటూ ఒకటి రెండు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఈ సినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.అయితే దీపావళి పండగకు వరుసబెట్టి స్టార్ హీరోలు మొదలుకొని యంగ్ హీరోల వరకు అందరూ తమ చిత్రాల పోస్టర్లను, తాజా అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు.
తమ అభిమానులకు పండగ ట్రీట్ ఇస్తున్నారు.అయితే తామేమీ తక్కువ కాదంటున్నారు వెంకీ మామ టీమ్.
దీపావళి సందర్భంగా వెంకీ మామ చిత్రం నుండి ఓ తాజా పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ పోస్టర్‌లో చైతూను ఆర్మీ డ్రెస్‌లో చూపించి బ్యాక్‌గ్రౌండ్‌లో బోర్డర్ చూపిస్తే.
వెంకీ మామను మామూలు రైతుగా చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో వ్యవసాయాన్ని చూపించారు.దేశానికి రైతు, సైనికుడు చాలా అవసరం అని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు వెంకీ మామ చిత్ర యూనిట్.
ఈ సినిమాలో హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.







