సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ & రేటింగ్

సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలలోచివరి సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాగా రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి తన గత సినిమాలకు భిన్నంగా ప్రమోషన్స్ చేసి ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో సఫలమయ్యారు.

ఫస్ట్ డే బుకింగ్స్ విషయంలో అదరగొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యారు.

కథ :

వైడీ రాజు (వెంకటేశ్) పోలీస్ గా పని చేసి ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తుంటాడు.భార్య భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్) సైతం తన భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు.

ఈ దంపతులకు నలుగురు సంతానం కాగా బుల్లిరాజు పాత్ర కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.అయితే వైడీ రాజు గతంలో మీనూని (మీనాక్షి చౌదరి) ప్రేమించినా కొన్ని కారణాల వల్ల దూరమై ఉంటాడు.

అయితే ఒక కిడ్నాప్ కేసు వల్ల వైడీ రాజు మళ్లీ డ్యూటీ బాధ్యతలు తీసుకోవడంతో పాటు మీనూతో కలిసి పని చేయాల్సి వస్తుంది.అయితే వైడీ రాజు లవ్ స్టోరీ గురించి తెలిసిన భాగ్యం భర్తను ఒంటరిగా వదిలి ఉండటానికి ఇష్టపడదు.

Advertisement

భాగ్యం, మీనూ పాత్రల విషయంలో ఎలాంటి ముగింపు ఉంటుంది? వైడీ రాజు కిడ్నాప్ కేసును ఎలా పరిష్కరించాడు? కిడ్నాపర్ల డిమాండ్లు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధామనే ఈ సినిమా.

విశ్లేషణ :

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తొలి మూవీ పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు ప్రతి సినిమాకు పాత కథనే ఎంచుకున్నా కథనంతో మ్యాజిక్ చేస్తూ విజయాలను అందుకుంటున్నారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.విక్టరీ వెంకటేశ్ బలం కామెడీ కాగా ఆయన బలాన్ని అనిల్ రావిపూడి ( Anil Ravipudi )పర్ఫెక్ట్ గా వాడుకున్నారు.

కేవలం 72 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ షూటింగ్ పూర్తి కాగా సంక్రాంతి పండుగకు ఈ సినిమా పర్ఫెక్ట్ మూవీ అని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు తగ్గిన తరుణంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యాన్స్ కోరుకున్న ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వీకే నరేష్, శ్రీనివాసరెడ్డి, వీటీవీ గణేష్ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంతో పాటు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.

టెక్నీషియన్‌తో మహిళ అఫైర్.. గీజర్‌లో కెమెరా పెట్టి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడంటూ నాటకం.. చివరకు?

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మెయిన్ అస్సెట్ మ్యూజిక్ అని చెప్పాలి.మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు.సినిమాలో ఉన్న ప్రతి పాట అద్భుతం అని చెప్పవచ్చు.

Advertisement

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా కుదిరాయి.దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేశ్ వన్ మ్యాన్ షో అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రీన్ ప్లే ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం లేకపోవడం సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఇప్పటికే చూసిన చాలా సినిమాలను గుర్తుచేసేలా ఉండటం

బాటమ్ లైన్ :

వెంకటేశ్ అభిమానులను మెప్పించే సంక్రాంతికి వస్తున్నాం

రేటింగ్ :

3.0/5.0 .

తాజా వార్తలు