వెంకటేష్ ను అస్సలు మెప్పించలేక పోతున్న రచయితలు, దర్శకులు

సీనియర్ హీరో వెంకటేష్( Venkatesh ) ఆ మధ్య వరుసగా సినిమాల్లో నటించాడు.సినిమాల సంఖ్య పెరిగింది కానీ సక్సెస్ శాతం అనేది దారుణంగా పడి పోయింది.

 Venkatesh Not Accepting New Films Due To Storys Details, Balakrishna, Chiranjeev-TeluguStop.com

దాంతో వెంకటేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.వెంకటేష్ ఎందుకు ఇలాంటి కథలను ఎంపిక చేసుకున్నాడు అంటూ కొన్ని సినిమా ల పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

అభిమానుల అసంతృప్తి తో వెంకటేష్ సినిమాల ఎంపిక విషయం లో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు.ఇప్పటికే ఆయన హీరోగా కేవలం ఒకే ఒక సినిమా రూపొందుతోంది అనే విషయం అందరికి తెల్సిందే.

మరో వైపు ఆ సినిమా తర్వాత చేయాల్సిన సినిమా కోసం వెంకీ కథ వింటున్నాడు.

Telugu Balakrishna, Chiranjeevi, Vankatesh, Saindhav, Venkatesh, Venkatesh Story

గత కొన్ని నెలలుగా ఎంతో మంది రచయితలు ( Writers ) వెంకటేష్ కి కథ ను వినిపించేందుకు వెళ్లారట.అయితే ఏదో ఒక లోపం అనిపించి కథ ను తిరస్కరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన వెంకటేష్ ఇప్పుడు మెల్లగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.

అందుకోసం కథల ఎంపిక విషయం లో కాస్త ఎక్కువ సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడు.కథల ఎంపిక( Story Selection ) విషయంలో జాగ్రత తీసుకోవాలి అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ వచ్చిన ప్రతి ఒక్క కథ ను కూడా రిజెక్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

వెంకటేష్ కథ ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడని.అందుకే కథలను తిరస్కరిస్తున్నాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Vankatesh, Saindhav, Venkatesh, Venkatesh Story

అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా అభిమానులు మాత్రం వెంకీ నుండి మరో మంచి సినిమా ను ఆశిస్తున్నారు.అది ఎప్పుడు వస్తుందో చూడాలి.ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా ముందు ముందు ఆయన నుండి అలాంటి తరహా సినిమాలు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే వెంకటేష్ మాత్రం మెల్లగా సినిమాలు చేయడం అభిమానులకు నచ్చడం లేదు.ఫలితం తో సంబంధం లేకుండా వెంకీ వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube