అమెరికా ఆంక్షలకు( US Sanctions ) వ్యతిరేకంగా లక్షలాదిమంది ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.అమెరికా ఆంక్షలకు మేము బెదరం, మేమేమి వారి కట్టు బానిసలం కాదు అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లా గుయెరా( La Guaira ) నగర వీధుల్లో గురువారం నిర్వహించిన సిటిజెన్స్ మార్చ్‌కి( Citizens March ) ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో తన మద్దుతును తెలియజేయడం ప్రత్యేకతని సంతరించుకుంది.ఈ సందర్భంగా మదురో( President Maduro ) ఓ ట్వీట్ చేయడం కూడా గమనించవచ్చు.
ఆయన ట్వీట్ ని ఒకసారి పరిశీలిస్తే, “మేము సామ్రాజ్యవాదానికి ఎట్టి పరిస్థితులలోను లొంగిపోము.ప్రతిఘటనలను, పోరాటాలను కొనసాగిస్తాము.ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ బొలివేరియన్ విప్లవాన్ని గుర్తుచేస్తున్నాను.” అంటూ రాసుకొచ్చారు.
ఇంకా అయన ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ… “వాలెస్‌డెల్ టురులోని శాంటా లూసియా వీధుల్లో పోరాట యోధులను చూసినప్పుడు నా హృదయం ఆనందంతో ఉప్పొంగి పోయింది.ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో భాగస్వామ్యమైన పౌరులందరికీ, నా ధన్యవాదాలు.వారి వారి ప్రేమకు నేను పాత్రుడను.వీధుల్లో పౌరుల ప్రసంగాలు, వారు చూపిస్తున్న తెగువ చూస్తే గెలుపు పతాకం మేము ఎగురవేస్తాము అని కచ్చితంగా అనిపిస్తోంది.” అని మదురో పేర్కొన్నారు.ఈ సందర్భంగా లా గుయెరా రాష్ట్ర గవర్నర్ జోస్ టెరాన్ మాట్లాడుతూ.‘ప్రజల నిరసనలకు వ్యతిరేకంగా వారిని దిగ్భందించడం గానీ, లేదా.జోక్యం చేసుకోవడం గానీ చేయము’ అని అన్నారు.
ఇకపోతే, వెనిజులా-అమెరికా దేశాల మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు.వెనిజులా( Venezuela ) అమెరికన్లు యునైటెడ్ స్టేట్స్‌లోని 20 లాటిన్ అమెరికన్ సమూహాలలో ఒకరిగా చెప్పుకోవచ్చు.యునైటెడ్ స్టేట్స్‌లో,( USA ) ఆశ్రయం అభ్యర్థిస్తున్న జాతీయుల జాబితాలో వెనిజులా ప్రజలు అగ్రస్థానంలో వున్నారని గణాంకాలు చెబుతున్నాయి.పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో, చాలా మంది యూరోపియన్ వలసదారులు వెనిజులాకు వెల్ళడం జరిగింది.
చాలా మంది వెనిజులా ప్రజలు మెరుగైన విద్యను పొందాలనే ఆశతో యునైటెడ్ స్టేట్స్‌లో స్థిరపడ్డారు.గ్రాడ్యుయేషన్ తర్వాత అక్కడే స్థిరపడడం జరిగింది.