యూఎస్ లో 'వీరసింహారెడ్డి' క్రేజ్ నెక్స్ట్ లెవల్.. ప్రీ సేల్స్ తోనే రికార్డ్!

మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది.అంతా సంక్రాంతి పండుగలో రిలీజ్ కాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

 Veerasimha Reddy Response In Usa, Usa, Veera Simha Reddy, Nandamuri Balakrishna,-TeluguStop.com

మరి సంక్రాంతికి ఈసారి భారీ పోటీ నెలకొనబోతుంది.టాలీవుడ్ నుండి రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ”వీరసింహారెడ్డి” సినిమా ఒకటి.

ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు.

క్రాక్ వంటి సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత ఏకంగా బాలయ్య తోనే సినిమా చేసాడు.

ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపబోతున్నాడు.బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ క్రేజీ సినిమా ‘వీరసింహారెడ్డి’ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా రిలీజ్ దగ్గర అవుతుండగా యూఎస్ మార్కెట్ లో అయితే మాసివ్ రెస్పాన్స్ తో దూసుకు వెళ్తుంది.లేటెస్ట్ గా అక్కడ వీరసింహారెడ్డి సినిమా ఏకంగా 4 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసింది.ప్రీమియర్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేస్తుండగా ఒక డే 1 నాటికీ మరింత రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉంది.మరి మొదటిసారి ఓవర్సీస్ లో కూడా బాలయ్య ఈ రేంజ్ లో దూసుకు వెళ్లడం నందమూరి అభిమానులకు ఆనందంగా ఉంది.

ఇక ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే వరుస సాంగ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.అలాగే తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.ఇక మరొక వారం రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో మంచి ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా చిరు సినిమాకు ఎలాంటి పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube