అభిమానులకు వీర సింహారెడ్డి డైరెక్టర్ క్షమాపణలు... ఏమైందంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదల కానుంది.

 Veera Simha Reddy Director Apologizes To Fans What Happened, Veera Simha Reddy ,-TeluguStop.com

డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒంగోలులో ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.అదేవిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేశారు.

ఈ సినిమాలో మాస్ మొగుడు అంటూ సాగే ఈ పాటను లాంచ్ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ నందమూరి అభిమానులకు క్షమాపణలు చెప్పారు.అయితే ఈయన అభిమానులకు క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఒంగోలులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పోలీసులు కేవలం 30 వేల మంది అభిమానులకు మాత్రమే పాస్ లు ఇచ్చారు.అయితే బయట మరో 50 వేల మంది వరకు అభిమానులు ఉన్నారని ఈయన తెలిపారు.

ఇక బయట ఉన్నటువంటి అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని విషయం చాలా ఆలస్యంగా తెలిసిందని ఈ సందర్భంగా గోపీచంద్ తెలిపారు.ఇలా బాలయ్య అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తనకు బాధ కలిగించిందని అందుకు అభిమానులు తనని క్షమించాలని ఈ సందర్భంగా ఈయన క్షమాపణలు కోరారు.ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని సెన్సార్ సభ్యులు కూడా సినిమాకి పాజిటివ్ ఇచ్చారనీ తెలిపారు.ఇక ఈ సంక్రాంతికి ఒకవైపు బాలకృష్ణ మరోవైపు చిరంజీవి ఇద్దరు కూడా పోటీపడుతూ తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో అభిమానుల మధ్య కూడా పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube