మీనా మరియు వెంకటేష్( Venkatesh ) హీరో హీరోయిన్స్ గా సినిమా వస్తుంది అంటే అప్పట్లో అది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉండేది అభిమానుల్లో.మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సినిమాలు ఎంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
1.
చంటి
వెంకటేష్, మీనా కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం చంటి( Chanti ).తెలుగు నాట సూపర్ హిట్ జోడిగా పేరు పొందిన వీరికి ఇది మొదటి సినిమా.మీనా కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ చంటి.రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1992 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కే.ఎస్.రామారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి గాను వెంకటేష్ ఉత్తమ నటుడిగా నంది వార్డు అందుకున్నాడు.
వెంకటేష్ తో పాటు ఉత్తమ లిరిసిస్ట్ గా వేటూరి గారు, ఉత్తమ విలన్ గా నాస్సర్, ఉత్తమ ప్లేబాక్ సింగర్ గా బాలు గారు నంది అవార్డులు అందుకున్నారు.

2.
సుందరకాండ
చంటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా తరువాత వెంకటేష్, మీనా ( Meena ) జోడిగా నటించిన రెండో చిత్రం సుందరకాండ.ఈ చిత్రం 1992 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
3.
అబ్బాయి గారు
వెంకీ మీనా కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అబ్బాయిగారు( Abbayigaru ).ఈ వీ వీ సత్యన్నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1994 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం లో గడసరి కోడలు పాత్రలో మీనా( Meena ) చేసిన అభినయం అందరిని ఆకట్టుకుంది.ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

4.
సూర్యవంశం
వెంకటేష్ హీరోగా, మీనా హీరోయినిగా నటించిన నాలుగో చిత్రం సూర్యవంశం.భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళం లో 1997 లో విడుదలైన సూర్య వంశం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం.ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది.







