ప్రభాస్( Prabhas ) హీరోగా మొదట్లో మంచి సినిమాలు చేశారు ఆ సినిమాలు హిట్ అయ్యాక ఆయన అనుష్క తో కలిసి బిల్లా లాంటి సినిమా చేశాడు ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ వీళ్ళ జోడీ కి మంచి పేరు వచ్చింది ఇక దాంతో మిర్చి సినిమాలో కూడా అనుష్క నే హీరోయిన్ గా నటించింది…ఇక ఈ సినిమా మంచి విజయం సాధించింది దాంతో బాహుబలి రెండు పార్ట్స్ లలో కూడా తను హీరోయిన్ గా నటించి మెప్పించింది… ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని చాలా ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరూ పెళ్లి ఆలోచనలో ఉన్నారని కూడా పలు మార్లు వార్తలు వచ్చాయి…
కానీ, ఆ వార్తలు నిజం కాదని ప్రభాస్, అనుష్క కొట్టిపారేశారు.అయితే వీరి మధ్య లవ్ ఉందా.? లేదా.? అన్నది పక్కన పెడితే.ప్రభాస్-అనుష్క బెస్ట్ ఫ్రెండ్స్.వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.ఆ బాండింగ్ తోనే గతంలో ప్రభాస్ కు అనుష్క ఓ సినిమా స్క్రిప్ట్ గురించి చెప్పిందట.అయితే స్క్రిప్ట్ విన్న వెంటనే ప్రభాస్ ఆ సినిమా చెయ్యొద్దంటూ అనుష్కకు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చాడట.అయినాసరే ప్రభాస్ మాటలు లెక్కచేయకుండా అనుష్క ఆ సినిమా చేసింది…
అఫ్ కోర్స్ ఆ సినిమా ఫ్లాప్ అయింది.కానీ, అనుష్క నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.ఇంతకీ ప్రభాస్ వద్దని చెప్పినా అనుష్క చేసిన సినిమా మరేదో కాదు `వేదం( Vedam )క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, దీక్షా సేథ్, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలను పోషించారు.2010 లో విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ సినిమాలో అనుష్క సరోజ అనే ఓ వేశ్యగా నటించింది.అప్పటికే అనుష్క సౌత్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తుంది.అలాంటి అనుష్క వెండితెరపై వ్యభిచారిగా కనిపించబోతోందని తెలిసేసరికి అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి.వేశ్యగా నటించి అనుష్క చాలా పెద్ద తప్పు చేసిందని.ఇక ఆమె కెరీర్ క్లోజ్ అన్న ప్రచారం కూడా జరిగింది.ఇలాంటి నెగటివ్ ఇంప్యాక్ట్ పడుతుందని భావించే ప్రభాస్ కూడా అనుష్కను వేదం మూవీ చెయ్యొద్దని స్ట్రోంగ్ గా చెప్పాడు.
కానీ, స్క్రిప్ట్ నచ్చడంతో అనుష్క వెనకడుగు వేయలేకపోయింది.అయితే వేదం సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా.
అనుష్క పాత్రకు మంది మంచి రెస్పాన్స్ వచ్చింది.సినిమా విడుదలకు ముందు విమర్శించిన వారే వేశ్య పాత్రలో అనుష్క నటనకు ఇంప్రెస్ అయ్యి ప్రశంసలు కురిపించారు.
పైగా అనుష్క కెరీర్ లో ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో సరోజ రోల్ కూడా ఒకటిగా నిలిచింది…ఇక ఈ సినిమాని చూసిన ప్రభాస్ కూడా అనుష్క ఆ పాత్ర లో నటించిన తీరు…దర్శకుడు ఆ పాత్ర ని డిజైన్ చేసిన విధానం బాగున్నాయి అని మళ్ళీ అనుష్క తో చెప్పాడట…
.