మెగా 156.. ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు.ఇటీవలే చిరంజీవి కొత్తగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.

 Vasishta Comments About Chiranjeevi Mega156 , Mega157, Jagadeka Veerudu Athiloka-TeluguStop.com

అందులో మెగా 156 ఒకటి.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Mallidi Vasishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.బింబిసార వంటి హిట్ అందుకున్న వసిష్ఠ మెగాస్టార్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.

పంచభూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

ప్రజెంట్ ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.కాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ చేసిన కామెంట్స్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.తాజాగా డైరెక్టర్ వసిష్ఠ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ.తన చిన్నతనంలో మెగాస్టార్ గారి జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ( Jagadekaveeru Atiloka Sundari movie ) చూసి ఎంతో ఆశ్చర్య పోయానని అలాంటి సోషియో ఫాంటసీ సినిమా మెగాస్టార్ మళ్ళీ చేయలేదని అందుకే తాను తీయబోయే మూవీ కోసం ఎంతగానో శ్రద్ధ తీసుకుంటున్నాను అని ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు తెలిపాడు.అంతేకాదు ఈ సినిమాలో దాదాపు 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని.చిరంజీవి గాని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ అందరు ఆయన నుండి ఆశించే అన్ని అంశాలు తన పాత్రలో ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube