మెగా న్యూ కపుల్స్ ప్రస్తుతం హనీమూన్ వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) వరుణ్ తేజ్ (Varun tej) వెళ్లినటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు.అయితే పెద్దలకు వీరి ప్రేమ విషయాన్ని తెలియజేసి జూన్ నెలలో నిశ్చితార్థం జరుపుకున్నటువంటి వీరిద్దరూ నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

ఇలా ఇటలీలో( Italy ) కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట అనంతరం హైదరాబాద్ డెహ్రాడూన్లు కూడా రిసెప్షన్ వేడుకలను నిర్వహించుకున్నారు.ఇలా వీరి రిసెప్షన్ అనంతరం వీరిద్దరూ హనీమూన్(Honeymoon) వెళ్లారని తెలుస్తోంది.అయితే ఈ జంట హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లారన్న విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది.మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్( Mega Family Sentiment ) దేశమైనటువంటి ఫిన్లాండ్ కు( Finland ) వెళ్లారని సమాచారం.
ఇది మెగా ఫ్యామిలీ హనీమూన్ సెంటిమెంట్ దేశం అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఫిన్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ దేశం మాత్రమే కాకుండా వీరిద్దరూ సరికొత్తగా మరికొన్ని దేశాలను కూడా చుట్టేసి రావాలని భారీగానే ప్లాన్ చేశారట.అయితే ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన( Ram Charan Upasana ) దంపతులతో పాటు అల్లు అర్జున్ స్నేహ రెడ్డి( Allu Arjun Sneha Reddy ) దంపతులకు కూడా వీరి హనీమూన్ కోసం ఫిన్లాండ్ వెళ్లడం విశేషం.
ఇలా వరుణ్ తేజ్ కూడా ఇప్పుడు అదే దేశానికి వెళ్లడంతో ఈ కంట్రీ మెగా హనీమూన్ సెంటిమెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా మొదటిసారి మిస్టర్( Mister ) సినిమాలో కలిసిన నటించారు.శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిస నటించారు.అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి అభిప్రాయాలు ఒకరికొకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారని వీరు ప్రేమ విషయం ఇటలీలో బయటపడటంతో తమ ప్రేమకు గుర్తుగా ఇటలీలోనే వీరి వివాహపు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తుంది.
ఇక మిస్టర్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి అంతరిక్షం అనే సినిమాలో కూడా నటించారు.అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయిన వీరి ప్రేమ మాత్రం ఎంతో అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పాలి.







