Varun Tej : భార్య గురించి నెగిటివ్ ప్రచారం.. ఆ క్లారిటీ ఇచ్చి వరుణ్ తేజ్ వాళ్ల నోర్లు మూయించాడుగా!

మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun tej )ఇటీవలే హీరోయిన్ లావణ్య ( Lavanya tripathi )అనే ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న ఈ జంట ఆ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.

 Varun Tej Karuna Kumar Vyra Entertainments Pan India Movie Matka Regular Shoot-TeluguStop.com

తిట్టకేలకు ఇటీవలే ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దల అంగీకారంతో ఇటలీలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.ఇది ఇలా ఉంటే లావణ్య వరుణ్ తేజ్ ల వివాహం జరిగి ఇంకా నెలరోజులు కూడా కాకముందే అప్పుడే వరుణ్ తేజ్ సినిమాల గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమా( Matka ) నిలిచిపోయిందని, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సినిమా నిలిపివేశారంటూ ప్రచారం జరిగింది.

Telugu Matka, Pan India, Varun Tej-Movie

దానికి వారి వివాహానికి ముడిపెడుతూ కొన్ని మాటలను ముడి పెడుతూ యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడంతో తన భార్య గురించి ఇలా మాట్లాడటం, బాలేదని అనుకున్నారేమో తెలియదు గాని వరుణ్ తేజ్ వెంటనే ఈ సినిమా యూనిట్ తరఫున అధికారిక ప్రకటన ఇప్పించేశారు.పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం మట్కా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది.అయితే ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది.1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారని యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు.

Telugu Matka, Pan India, Varun Tej-Movie

హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారని, ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయని తెలుస్తోంది.నలుగురు ఫైట్ మాస్టర్‌లు యాక్షన్ ని పర్యవేక్షిస్తారని, 24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారని అంటున్నారు.వరుణ్ తేజ్ కు హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ పూర్తి మేక్ఓవర్ అవుతున్నారని ఆయన సరసన నోరా ఫతేహి,( Nora Fatehi ) మీనాక్షి చౌదరి ( Meenaakshi Chaudhary )హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

వరుణ్ తేజ్ తన భార్య గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు అనుకొని వెంటనే మూవీ మేకర్స్ నుంచి క్లారిటీ ఇప్పించారు.దీంతో వారి గురించి నెగిటివ్గా ప్రచారం చేసిన వారికి బాగా బుద్ధి చెప్పినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube